Arvind Kejriwal: రేపు కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల కీలక సమావేశం.. ప్రధానంగా చర్చించే అంశాలివే..
ఢిల్లీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసంలో సమావేశం కానున్నారు.ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం
Arvind Kejriwal: ఢిల్లీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసంలో సమావేశం కానున్నారు.ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోందని.. ఈనేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలంతా కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకులు బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఆందోళన మొదలైంది. సొంతపార్టీలోనే తిరుగుబాటు తీసుకురావడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీపై కుట్రజరుగుతోందని ఆపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేతో సమావేశమై బీజేపీ చేస్తున్న అనైతిక రాజకీయాలపై చర్చించేందుకు ఈసమావేశం నిర్వహిస్తున్నట్ల తెలుస్తోంది.
సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు ప్రయోగించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తీర్మానించారు. మద్యం విధానాల తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ జరిపిన దాడుల్లో ఎలాంటి పత్రాలు, లెక్క తేలని నగదు, బంగారం లభించకపోయినా దర్యప్తు ఏజెన్సీల ద్వారా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు ఆపార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. రేపు ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..