AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chidambaram: వీడని చిదంబర రహస్యం..రోజంతా శ్రమించినా తేలని లెక్కలు.. ఆలయ సంపదపై ఉత్కంఠ కంటిన్యూ

మూడోరోజు సంపద లెక్కింపు పూర్తయింది. కానీ చిదంబర రహస్యం మాత్రం వీడలేదు. నటరాజస్వామి సంపద లెక్కింపుకు మరిన్ని రోజులు పట్టే అవకాశముంది. దీంతో చిదంబరం ఆలయ సంపదపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

Chidambaram: వీడని చిదంబర రహస్యం..రోజంతా శ్రమించినా తేలని లెక్కలు.. ఆలయ సంపదపై ఉత్కంఠ కంటిన్యూ
Chidambaram Natarajar Templ
Sanjay Kasula
|

Updated on: Aug 24, 2022 | 9:57 PM

Share

చిదంబరం నటరాజ స్వామి ఆలయ సంపద లెక్కింపు కొనసాగుతోంది. దీక్షితుల సమక్షంలో మూడోరోజు లెక్కింపు ప్రక్రియ ముగిసింది. 2008వరకు స్వామి వారికి వచ్చిన నగలు, కానుకలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు అధికారులు. ఐతే సంపద మొత్తం లెక్కింపుకు మరో వారం రోజులు పట్టే అవకాశముంది. ఎందుకంటే రోజుకు రెండేళ్లకు సంబంధించిన సంపద లెక్కింపు మాత్రమే పూర్తవుతోంది. ఈ లెక్కన 2022 వరకు మొత్తం సంపద వివరాలను సేకరించేందుకు మరిన్ని రోజులు పట్టనుంది. దీక్షితులు వర్సెస్ దేవాదాయ శాఖగా రెండు నెలలుగా కొనసాగిన ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్‌ పడటంతో మూడ్రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

1956 తర్వాత ఆలయ సంపద లెక్కింపు జరగడం ఇదే తొలిసారి..2005లో సంపద లెక్కింపు కోసం నాటి డిఎంకె ప్రభుత్వం ప్రయత్నించగా, ఆలయ బాధ్యతలు చూస్తున్న దీక్షితులు వర్గం కోర్టు ద్వారా నిలుపుదల చేసుకుంది..తాజాగా సంపద లెక్కింపు వ్యవహారాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఐతే సంపద లెక్కింపు కోసం వచ్చిన అధికారులను దీక్షితుల వర్గం అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.

చివరకు దీక్షితులు వర్గం అంగీకరించడంతో ఆలయ సంపద వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఐతే ఈ లెక్కింపు ప్రక్రియ..మరో వారం రోజులు పట్టే అవకాశముంది. దీంతో చిదంబరం నటరాజస్వామి సంపద ఎంత అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు సంపద లెక్కింపు నేపథ్యంలో ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది స్టాలిన్‌ ప్రభుత్వం. నటరాజస్వామి సంపద వివరాలను దేవాదాయశాఖామంత్రి శేఖర్‌ బాబు సమక్షంలో మీడియాకు తెలిపే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..