Toothache Relief: పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందాలనుకుంటే.. ఈ 3 పద్ధతులను అనుసరించండి..

పంటిలో నులిపురుగులు, దంతాలు పుచ్చిపోవడం, దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, కాల్షియం లోపం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల పంటి నొప్పి వస్తుంది.

Toothache Relief: పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందాలనుకుంటే.. ఈ 3 పద్ధతులను అనుసరించండి..
Toothache Relief
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 24, 2022 | 10:24 AM

పంటి నొప్పి అనేది అర్ధరాత్రి కూడా ఇబ్బంది పెట్టే సమస్య. సరిగ్గా శుభ్రం చేయకపోవడం, దంతాల్లో పురుగులు, దంతాలు పుచ్చిపోవడం, దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, కాల్షియం లోపం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, దంతాలు బలహీనపడడం వంటి అనేక కారణాల వల్ల పంటి నొప్పి వస్తుంది. ఏదైనా దంత సమస్య చికిత్స కోసం మనం దంతవైద్యుని వద్దకు వెళ్తాం.. కొన్నిసార్లు పంటి నొప్పి రాత్రి లేదా సెలవు దినాలలో ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మనం నొప్పితో మూలుగుతూ ఉంటాం. మీరు కూడా అకస్మాత్తుగా పంటి నొప్పితో బాధపడి, వైద్యుని వద్దకు వెళ్లలేకపోతే.. మీరు కొన్ని హోం రెమోడీ చిట్కాలను అనుసరించవచ్చు. కొన్ని నివారణలను అనుసరించడం ద్వారా  మీరు మీ పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. పంటి నొప్పి, ఇన్‌ఫెక్షన్‌ను సమర్థవంతంగా నయం చేసే కొన్ని హోం రెమెడీలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి:

పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, గోరువెచ్చని నీటితో పుక్కిలించండి. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది. నొప్పి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. మీరు కొన్ని సెకన్ల పాటు మీ నోటిలో గోరువెచ్చని నీటిని ఉంచి,.. ఆపై దానిని ఉమ్మివేయండి. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల చిగుళ్లకు ఉపశమనం లభిస్తుంది.

పిప్పరమింట్ టీ:

ఏదైనా టీ తాగడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు, పిప్పరమెంటు టీలో ప్రభావిత ప్రాంతాన్ని పుల్లింగ్ చేయడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి. పిప్పరమింట్ టీ పంటి నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

లవంగం నూనె:

పంటి నొప్పిని తగ్గించడంలో లవంగం నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నొప్పిగా ఉన్న పంటిపై కొన్ని చుక్కల లవంగం నూనెను పూయడం వల్ల పంటి నొప్పి , వాపు తగ్గుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం