AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: పిన్న వయసులో గుండెపోటుతో ప్రాణాలొదిలిన సోనాలి ఫోగట్‌.. యువతలో ఈ మాయదారి జబ్బు ఎందుకు వస్తుందంటే?

బీజేపీ నాయకురాలు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్, నటి సోనాలి ఫోగట్ గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు కేవలం 42 ఏళ్లు మాత్రమే. కేవలం సోనాలి మాత్రమే కాదు.. కొద్దిరోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ 58 ఏళ్ల వయస్సులో గుండెపోటుకు గురై..

Heart Attack: పిన్న వయసులో గుండెపోటుతో ప్రాణాలొదిలిన సోనాలి ఫోగట్‌.. యువతలో ఈ మాయదారి జబ్బు ఎందుకు వస్తుందంటే?
Heart Attack
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 24, 2022 | 7:43 AM

Share

బీజేపీ నాయకురాలు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్, నటి సోనాలి ఫోగట్ గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు కేవలం 42 ఏళ్లు మాత్రమే. కేవలం సోనాలి మాత్రమే కాదు.. కొద్దిరోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ 58 ఏళ్ల వయస్సులో గుండెపోటుకు గురై..ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది ప్రముఖ టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిద్ధార్ధ శుక్లా 40 ఏళ్లకే గుండెపోటుతో కన్నుమూశాడు. అంతకుముందు కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయస్సులో హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా పిన్న వయస్సులోనే గుండెపోటుతో ప్రముఖ సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రతి ఐదుగురిలో ఒకరు..

కాగా 65 నుండి 70 సంవత్సరాలు దాటిన వారికి గుండెపోటు సమస్యలు వచ్చేవి. అయితే ఇటీవలి కాలంలో 25 నుంచి 45 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణిస్తున్న కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా మయోకార్డియల్ ఇన్ఫార్షన్‌ (MI) అనేది వృద్ధులలో ఎక్కువగా కనిపించేది. అయితే, ఇప్పుడు ప్రతి ఐదుగురు గుండెపోటు బాధితుల్లో ఒకరు 40 ఏళ్లలోపు ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఇక దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే. రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. దీంతో చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ధూమపానం, ఊబకాయం, శారీరక వ్యాయామం లేకపోవడంచ హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ఇతర కారణాల వల్ల యువకులలో గుండెపోటులు పెరుగుతున్నాయి. మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. అది లేకుండా శరీరానికి అర్థం లేదు. ఆక్సిజన్, రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులు నిరోధించబడినప్పుడు, అది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కొన్నిసార్లు రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల గుండెపోటు వస్తుంది.

గుండెపోటుకు ప్రధాన కారణాలు

  • అనారోగ్యకరమైన జీవనశైలి
  •  అధిక మద్యం మరియు ధూమపానం
  • అధిక బరువు
  • మానసిక ఒత్తిడి
  •  అధిక రక్తపోటు
  •  మధుమేహం

గుండెపోటును తప్పించుకోండిలా

చిన్న వయస్సులోనే మీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

  •  ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి.
  •  సోడియం, ఉప్పు తీసుకోవడం తగ్గించండి.
  • ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించండి.
  • రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలి
  • ధూమపానం మానేయండి. ధూమపానం చేసేవారు మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే పొగను పీల్చకండి.
  • సరైన జీవనశైలిని అలవర్చుకోండి.
  • పొగాకును ఏ రూపంలోనూ తీసుకోవద్దు.
  • యోగా, స్విమ్మింగ్, సంగీతం మొదలైన వినోద కార్యక్రమాల ద్వారా ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోండి.
  • యోగా లేదా ధ్యానం కోసం కొంత సమయాన్ని ఎంచుకోండి.
  • వీలైనంత చురుకుగా ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.

అలక్ష్యం వద్దు.. నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్, కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్. సంజీవ్ గేరా యువతలో గుండెపోటుల పెరుగుదల గురించి మాట్లాడుతూ.. యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమన్నారు. అలాగే ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం లేదా అసౌకర్యం వంటి లక్షణాలను విస్మరించకూడదన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు, హై బిపి, మధుమేహం లేదా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా ఊబకాయం వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నవారు క్రమం తప్పకుండా బిపి మరియు షుగర్‌ని తనిఖీ చేసుకోవాలని సూచించారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..