Beer: మందు కొట్టే ముందు’చీర్స్’ అని ఎందుకు అంటారో తెలుసా..? అసలు కారణం తెలిస్తే షాకవుతారు..

పార్టీలో 'చీర్స్' కొట్టే ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇందుకు చాలా కారణాల ఉన్నాయి. మందు తాగడానికి ముందు 'చీర్స్' అని చెప్పుకుని తాగడం..

Beer: మందు కొట్టే ముందు'చీర్స్' అని ఎందుకు అంటారో తెలుసా..? అసలు కారణం తెలిస్తే షాకవుతారు..
Cheers
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 24, 2022 | 5:41 PM

ఎండొచ్చినా.. వానొచ్చినా.. చలేసినా.. కాలంతో సంబంధం ఉండదు. మందు బాబులకు కావల్సింది ఓ సందర్భం. అదే సందర్భంలో అందిరికి నచ్చనట్లుగా మందు కొట్టడం. ఎండకు ఇదే కరెక్టు అంటూ చిల్డ్ బీర్ ఎత్తుతూ చీర్స్ అంటారు. మద్యం తాగడం వల్ల ఆరోగ్యమే కాదు.. ప్రశాంతత ఉంటుందంటారు. పార్టీలో ‘చీర్స్’ చెప్పకుండా మందు తీసుకోరు.  ఫోన్ సంభాషణను ప్రారంభించే ముందు ‘హలో’ అని చెప్పకుండానే ముచ్చట మొదలు పెడితే ఎలా అసంపూర్ణంగా ఉంటుందో  ‘చీర్స్’ కొట్టకుండా మద్యం తాగితే మాజా ఉండదంటారు. పార్టీలో ‘చీర్స్’ కొట్టే ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇందుకు చాలా కారణాల ఉన్నాయి. మందు తాగడానికి ముందు ‘చీర్స్’ అని చెప్పుకుని తాగడం ఓ అలవాటు. ఎందుకు ఈ పదాన్ని వాడతారని ఎప్పుడైనా ఊహించారా..? అయితే అసలు ఈ చీర్స్ అనే పదం అలవాటు ఎలా అయ్యింది..? అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

చీర్స్ కథ ఏమిటి? – చీర్స్ గురించి మాట్లాడుతూ, ఇది పాత ఫ్రెంచ్ పదం చియర్ నుంచి ఉద్భవించింది, దీని అర్థం తల. అనేక నివేదికల ప్రకారం, ఇది 18 వ శతాబ్దం వరకు ఆనందం కోసం కూడా ఉపయోగించబడింది, కానీ తరువాత ఇది ఉత్సాహాన్ని చూపించడానికి కూడా ఉపయోగించబడింది. అందుకే ఉత్సాహం కోసం ప్రజలు చీర్స్‌ని ఉపయోగిస్తారు.

ఇలా కొట్టడం వల్ల కొన్ని చుక్కల మద్యం కింద పడుతుందని.. ఇది సంతృప్తి చెందని ఆత్మలకు ఉపశమనం ఇస్తుందని ఒక నమ్మకం. కొంతమంది వైన్ తాగే ముందు అక్కడక్కడా ఒక గ్లాసులో కొన్ని చుక్కలు చిలకరించడం మీరు తప్పక చూసి ఉంటారు. అదే సమయంలో జర్మనీలో మరో నమ్మకం ఉంది. ఈ గ్లాసుల శబ్దం విన్న వెంటనే దుష్టశక్తులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాయని జర్మన్ల నమ్మకం. పురాతన గ్రీస్ మరో నమ్మకం కూడా ఉంది. వారి నమ్మకం ప్రకారం, సంతోషకరమైన వాతావరణంలో ‘చీర్స్’ అంటూ గ్లాసులను పైకి ఎత్తడం దానిని దేవునికి సమర్పించే సంజ్ఞ అని అంటారు.

ఇవి కూడా చదవండి

మరో సంగతి కూడా ప్రచారంలో ఉంది. మానవులకు 5 ఇంద్రియ అవయవాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. మద్యం తాగడానికి ప్రజలు తమ చేతుల్లో గ్లాసును ఎత్తినప్పుడు, వారు మొదట దానిని ముట్టుకుంటారు. ఈ సమయంలో, ఆ లిక్కర్ కళ్ళలో కనిపిస్తుంది. తాగేటప్పుడు ఆ లిక్కర్ రుచిని నాలుకతో ఆస్వాదిస్తాం.  ఆ లిక్కర్ వాసనను ముక్కు ద్వారా అనుభవిస్తారు. మద్యం సేవించే ఈ మొత్తం ప్రక్రియలో చెవి మాత్రమే ఉపయోగించబడదు. ఈ లోపాన్ని పూడ్చుకోవడానికి.. చెవులకు కూడా ఆనందాన్ని ఇలా ‘చీర్స్’ చెప్పి ఖుషీ చేస్తారు.

జర్మన్ ఆచారాలలో గ్లాస్ కొట్టినట్లయితే, ఈవిల్ లేదా గోస్ట్(ఆత్మలు) ఆల్కహాల్‌కు దూరంగా ఉంటాయి. కాబట్టి అక్కడి జనం తాగే ముందు దయ్యాలను దూరంగా ఉంచడానికి ‘చీర్స్’ని ఉపయోగిస్తారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం