AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: చారిత్రాత్మకమైన రోజు.. 68 కేజీల కెమెరా చంద్రుడి నుంచి భూమి మొట్టమొదటి చిత్రాలు..

NASA: ఈ చిత్రం చారిత్రాత్మకమైనది. 23 ఆగష్టు 1966, NASA అంతరిక్ష నుండి భూమి ఈ చిత్రాన్ని తీసిన రోజు. మొట్టమొదటిసారిగా చంద్రుని ఉపరితలం నుండి భూమి..

NASA: చారిత్రాత్మకమైన రోజు.. 68 కేజీల కెమెరా చంద్రుడి నుంచి భూమి మొట్టమొదటి చిత్రాలు..
Nasa
Subhash Goud
|

Updated on: Aug 23, 2022 | 9:25 PM

Share

NASA: ఈ చిత్రం చారిత్రాత్మకమైనది. 23 ఆగష్టు 1966, NASA అంతరిక్ష నుండి భూమి ఈ చిత్రాన్ని తీసిన రోజు. మొట్టమొదటిసారిగా చంద్రుని ఉపరితలం నుండి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు. ఆ సమయంలో ఈ చిత్రం ముఖ్యాంశాలలో నిలిచింది. వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లలో ముద్రించిన ఈ చిత్రాన్ని ప్రజలు కత్తిరించి ఇంట్లో ఉంచి తమ పిల్లలకు చూపించారు. ఈ చిత్రాన్ని తీయడం కూడా అంత ఈజీ కాదు. 1960వ దశకంలో అపోలో మిషన్‌కు సంబంధించిన సన్నాహాలు అమెరికాలో పూర్తయ్యాయి. ఈ మిషన్ ఉద్దేశ్యం చంద్రునిపైకి మానవులను పంపడమే. ప్రపంచం కళ్ళు ఈ మిషన్‌పై ఉండేవి. చంద్రుని ఉపరితలం నిజంగా ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలకు కూడా తెలియని పరిస్థితి.

మానవులను అక్కడికి పంపడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఎంతో ఉంది. దీని కోసం నాసా 1966 ఆగస్టు 10న ఆర్బిటర్-1ను ప్రయోగించింది. మెరుగైన చిత్రాలను తీయడానికి వీలుగా అందులో 68 కిలోల కోడెక్ ఇమేజింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ ఆర్బిటర్‌లో ప్రధాన ఇంజిన్, 4 సోలార్ ప్లేట్‌లను కూడా ఏర్పాటు చేశారు. చంద్రుడిపైకి చేరుకున్న ప్రపంచంలోనే తొలి అంతరిక్ష నౌక ఇదే.

68 కిలోల కోడెక్ ఇమేజింగ్ సిస్టమ్ చంద్రుని ప్రతి కోణం నుండి చిత్రాలను తీయవలసి వచ్చింది. దీన్ని అంతరిక్ష నౌకలో అమర్చేందుకు, అంతరిక్షంలో ఫొటోలు తీయడానికి శాస్త్రవేత్తలు చాలా శ్రమించాల్సి వచ్చింది. 4 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంది. ఆగష్టు 23 న ఈ అంతరిక్ష నౌక భూమికి సంబంధించిన మొదటి ఫోటోను పంపింది. దాని మొత్తం ప్రయాణంలో ఆ అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలం నుండి మొత్తం 205 ఫోటోలను తీసింది. అక్టోబర్ 29, 1966న ఈ ఆర్బిటర్ భూమిపైకి దిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి