Prime Minister: పదవి నుంచి ఆ దేశ ప్రధాని సస్పెండ్.. అసలు కారణం ఏమిటి..?
Prime Minister: ఆ దేశ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ప్రయూత్ చాన్-వో-చాను పదవీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది..
Prime Minister: ఆ దేశ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ప్రయూత్ చాన్-వో-చాను పదవీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధానమంత్రి ప్రయూత్ తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతున్నారంటూ థాయ్‌లాండ్ ప్రతిపక్షాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారా..? లేదా అనే విషయం తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వెంటనే థాయ్‌లాండ్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రయూత్‌ను ఆదేశించింది. ఇంకో విషయం ఏంటంటే ఆయన చేపడుతున్న రక్షణ శాఖను కొనసాగింపు అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు న్యాయస్థానం. తాత్కాలిక ప్రధాని ఎవ్వరన్నది ఇంకా క్లారిటీ లేదు. రాజ్యాంగం ప్రకారం.. ఉప ప్రధానమంత్రి ప్రవిత్ వాంగ్ సువన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ప్రయూత్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు:
కాగా, ప్రయూత్ నాయకత్వంలో 2014, మే నెలలో సైనిక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం నాటికే ప్రయూత్ పదవీ కాలం ముగిసిందని, అయినా ఇంకా పదవిలో కొంనసాగుతున్నారని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆయన మద్దతు దారులు ఖండిస్తున్నారు. రాజ్యాంగ సవరణ ప్రకారం.. ప్రధాని పదవీ కాలం 8 సంవత్సరాలు అని, ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం అమల్లోకి వచ్చిన 2017 ఏప్రిల్ 6 నుంచి వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. మరో వైపు కొత్త రాజ్యాంగం ప్రకారం.. 2019 జూన్ 9న ప్రయూత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో నాటి నుంచే పదవీ కాలం మొతలవుతుందని కొందరి వాదన.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి