Pakistan: పాక్ సెక్యూరిటీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఆరుగురు భద్రతా బలగాలు మృతి, 11 మందికి గాయాలు
పాకిస్థాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని మిష్టా గ్రామంలోని చెక్ పోస్టుపై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ చర్యలతో ఆగ్రహించిన ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దాయాది దేశం పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్‌లోని ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో 6 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడికి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) బాధ్యత వహించింది. పాకిస్థాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని మిష్టా గ్రామంలోని చెక్ పోస్టుపై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ చర్యలతో ఆగ్రహించిన ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్థరాత్రి సెక్యూరిటీ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు
అధికారులు చెప్పిన ప్రకారం అర్థరాత్రి భద్రతా పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారు.11 మంది గాయపడ్డారు. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. జిల్లాలోని ఆజం వార్సాక్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 7 మంది ఉగ్రవాదులు మరణించగా.. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్న TTP
ఈ ప్రాంతంలో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ చురుగ్గా ఉందని పాకిస్తానీ భద్రతా బలగాలను నిరంతరం లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం వీరికి ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను తాలిబాన్‌లు ఖండిస్తూ వస్తున్నారు.
పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు, ఉద్రిక్తతలు పెరిగాయి. 3 సంవత్సరాల క్రితం 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




