Black Magic: నల్లమలలో క్షుద్ర పూజల కలకలం.. అనారోగ్యానికి కారణం క్షుద్ర పూజలే అంటూ గ్రామస్తుల ఆందోళన
ఎమిరెడ్డిపల్లి, జంగంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని రోడ్లపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవలే అతి భయంకరంగా క్షుద్ర పూజలు పూజలు నిర్వహించారు. పిండితో తయారు చేసిన బొమ్మలు, గుమ్మడికాయలు, నల్ల కోడిని చంపి నడి రోడ్డుపై వేశారు. ఎవరు చేశారో... ఎందుకు చేశారో తెలీదు. కానీ రోడ్లపై ఇలా భయంకరమైన పద్ధతిలో పూజలు చేయడం గ్రామాల్లో సంచలనంగా మారింది.
అమావాస్య, పౌర్ణమి వచ్చిందంటే చాలు నల్లమలలో విచ్చలవిడిగా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఈ రెండు రోజులు రాత్రి గడిచిందంటే చాలు గ్రామాల ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని ఎమిరెడ్డిపల్లి, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో మూడనమ్మకాలు హెచ్చుమీరుతున్నాయి. వరుసగా గ్రామాల్లో రోడ్లపై క్షుద్ర పూజలు గుప్పుమంటున్నాయి. గడిచిన కొద్దిరోజుల క్రితం నల్లమలలో ఇలాంటి చర్యలు తగ్గాయని అనుకుంటుండగా… తాజా ఘటనలు మళ్ళీ గ్రామాలను మూడ నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి.
ఎమిరెడ్డిపల్లి, జంగంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని రోడ్లపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవలే అతి భయంకరంగా క్షుద్ర పూజలు పూజలు నిర్వహించారు. పిండితో తయారు చేసిన బొమ్మలు, గుమ్మడికాయలు, నల్ల కోడిని చంపి నడి రోడ్డుపై వేశారు. ఎవరు చేశారో… ఎందుకు చేశారో తెలీదు. కానీ రోడ్లపై ఇలా భయంకరమైన పద్ధతిలో పూజలు చేయడం గ్రామాల్లో సంచలనంగా మారింది. ఇక అమావాస్య, పౌర్ణమి తర్వాతి రోజుల్లో స్థానికులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక్కడ ఏ రోడ్డుపై భయంకర క్షుద్ర పూజలు చూడల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఈ విధంగా పూజలు చేస్తే తాము తెల్లవారుజామున పంటపొలాలకి వెళ్లాలంటేనే భయమేస్తోందని రైతులు చెబుతున్నారు. వాటిని గమనించకుండా వెళితే తమకు ఏం జరుగుతుందోనని వాపోతున్నారు. ఇలాంటి క్షుద్ర పూజలతో తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అమాయక ప్రజలకు గాలం వేస్తున్న దొంగ స్వాములు:
గ్రామాలలో స్వాముల పేరుతో అమాయక ప్రజలను ఆకర్షించడానికి ఈ కొత్త విధానాలని పాటిస్తున్నారని చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలే నల్లమల గ్రామాల్లో ఎక్కడ చూసినా దొంగ స్వాములు, బాబాలు దర్శనం ఇస్తున్నారు. ఇదంతా వారిపనేనా అన్న అనుమానాలు గ్రామస్తుల్లో మొదలయ్యాయి. ఇక ఈ క్షుద్ర పూజలు, దొంగ స్వాముల కథలను పోలీసులు అరికట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మూడ నమ్మకాల ప్రబలు తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కీలకమైన అమావాస్య, పౌర్ణమి రోజుల రాత్రి పోలీసుల నిఘా పెంచితే వీటి గుట్టు వీడుతుందని గ్రామస్థులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..