AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇక తగ్గెదే లే.. హైడ్రాడకు హై పవర్స్‌, కేబినెట్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ ఇందుకు సబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైడ్రాకు హై పవర్స్‌ ఇవ్వనున్న్ల తెలిపారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. చెరువులు సహా గ్రేట్‌ హైదరాబాద్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలను సమర్ధవంతంగా తొలగించే లా హైడ్రాకు...

Hyderabad: ఇక తగ్గెదే లే.. హైడ్రాడకు హై పవర్స్‌, కేబినెట్ కీలక నిర్ణయం
Hydra
Narender Vaitla
|

Updated on: Sep 21, 2024 | 8:42 AM

Share

చెరువుల్లో, బఫర్‌ జోన్స్‌లో వెలిసిన కట్టడాలను కూల్చి వేస్తూ హైడ్రా దూసుకుపోతోంది. ఎన్ని రకాల ఆరోపణలు, విమర్శలు వచ్చినా తగ్గేదేలే అంటోంది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సైతం హైడ్రా విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా ఇకపై హై పవర్‌తో మరింత దూకుడు పెంచనుంది. హైడ్రాకు విస్తృత అధికారాలను ఇస్తూ చట్టబద్దత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ ఇందుకు సబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైడ్రాకు హై పవర్స్‌ ఇవ్వనున్న్ల తెలిపారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. చెరువులు సహా గ్రేట్‌ హైదరాబాద్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలను సమర్ధవంతంగా తొలగించే లా హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారు. ఇక ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల 27 అర్బన్‌ , లోకల్‌ బాడీలున్నాయి. ఐతే 51 గ్రామ పంచాయతీయలను కోర్‌ అర్బన్‌లో విలీనం చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

చెరువుల పరిరక్షణలో భాగంగా భూ దురాక్రమణలకు కల్లెం వేసేలా హైడ్రా మరింత బలోపేతం కాబోతోంది. మిగతా శాఖల తరహాలోనే హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను కల్పించేలా నియమ నిబంధనలను సడలిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. FTL,బఫర్ జోన్ లలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రాకు పూర్తి అధికారాలు కల్పించింది ప్రభుత్వం. హైడ్రా ఆపరేషన్స్‌ కోసం 150 మంది అధికారులు సహా 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

హైడ్రాకి చట్టబద్ధత కల్పించడం సహా , RRR అలైన్‌ మెంట్‌ ఖరారు చేసేందుకు 12మందితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్‌. SLBC టన్నెల్ పనులకు 4వేల 637 కోట్లు మంజూరు చేస్తూ, రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఖరీఫ్‌ పంట నుంచి సన్న బియ్యంపై రూ. 500 బోనస్‌ ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైడ్రా దూకుడుపై ఎవరేమన్నా.. చెరువులు, నాలాల పరిరక్షణే లక్ష్యమన్న ప్రభుత్వం..హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పించాలని నిర్ణయించింది. మరి హైడ్రా దూకుడు మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..