Hyderabad: రీల్స్ పిచ్చోళ్లు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే దుకాణం పెట్టారు.. చివరకు..
ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఏం చేయాలన్నా.. రీల్స్.. రీల్స్.. రీల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న కోరికతో గతకొంతకాలంగా రీల్స్ పిచ్చోళ్లు రెచ్చిపోతున్నారు. ఫేమస్ అవ్వడం కోసం... పిచ్చిపిచ్చి వేషాలేస్తూ ఏం చేస్తున్నామనేది కూడా మర్చిపోతున్నారు.
ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఏం చేయాలన్నా.. రీల్స్.. రీల్స్.. రీల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న కోరికతో గతకొంతకాలంగా రీల్స్ పిచ్చోళ్లు రెచ్చిపోతున్నారు. ఫేమస్ అవ్వడం కోసం… పిచ్చిపిచ్చి వేషాలేస్తూ ఏం చేస్తున్నామనేది కూడా మర్చిపోతున్నారు. మొన్నటికి మొన్న రోడ్లపై డబ్బులు వెదజల్లుతూ పోలీసులకు చిక్కిన ఓ యూట్యూబర్ స్టోరీ మరువక ముందే… ఇప్పుడు ఏకంగా స్టేషన్‌నే రీల్స్ కోసం వాడుకున్న ఘనులు ప్రతక్ష్యమయ్యారు. ఇక ఇలాంటి వారిపై చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు పోలీసులు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తాజాగా.. ముగ్గురు పోకిరీలు రీల్స్ కోసం పోలీస్ స్టేషన్ ను సైతం వదలలేదు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే రీల్స్ చేశారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఉప్పల్ పోలిస్ స్టేషన్ ఆవరణలో ఒక రీల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇది కాస్త పోలీసుల వరకు చేరింది. వీడియో వైరల్ కావడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు వ్యక్తులు ఎటువంటి అనుమతి లేకుండా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లో రీల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
పోలీసు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏ1 గా బల్విర్ సింగ్ తో పాటు మరో ఇద్దరి వ్యక్తుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటువంటి ఆకతాయి, అల్లరి చేష్టలకు పాల్పడే వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Case registered against these individuals who shot a reel for Instagram at Uppal PS premises #instareels #instagram #Police #Hyderabad @TOIHyderabad @RachakondaCop @TelanganaDGP pic.twitter.com/bj4fkaPnwN
— Pinto Deepak (@PintodeepakD) September 20, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..