Hyderabad: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుపై మొదలైన గలాటా..
ట్రిపులార్ ప్రాజెక్ట్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తోంది. రావిర్యాల నుంచి ఆమన్ గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడెల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. చౌటుప్పల్ దగ్గర జంక్షన్ మార్పు చేసింది. రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి అలైన్‌మెంట్‌ను...
రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అలైన్‌మెంట్ మార్పుపై వివాదం మొదలైంది. ఫ్యూచర్ సిటీకి బాటలు వేస్తున్నామని అధికార పార్టీ చెబుతుంటే.. స్వప్రయోజనాల కోసమే అలైన్‌మెంట్ మార్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అటు ట్రిపుల్ ఆర్‌పై కమిటీ వేస్తున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్డు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
ట్రిపులార్ ప్రాజెక్ట్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తోంది. రావిర్యాల నుంచి ఆమన్ గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడెల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. చౌటుప్పల్ దగ్గర జంక్షన్ మార్పు చేసింది. రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి అలైన్‌మెంట్‌ను చౌలపల్లి నుంచి ఏదురుగూడెం వరకు మార్పు చేసింది. ఫ్యూచర్ సిటీ అవసరాల దృష్ట్యా అలైన్ మెంట్ మార్చామని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి . దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొత్త అలైన్‌మెంట్‌తో దూరం 12 కి.మీ అయిందని బీఆర్‌ఎస్ అంటోంది. ఫోర్త్ సిటీ, పాత అలైన్ మెంట్ మధ్య దూరం 10 కిలో మీటర్లు ఉంటే కొత్త అలైన్ మెంట్‌తో ఆ దూరం 12 కిలో మీటర్లకు పెరిగిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తారు.
అమన్ గల్ దగ్గర 400 ఎకరాల కుందారం భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాజ వంశీయులతో బేరం కుదుర్చుకుని పేదలను వెల్లగొట్టి భూములు ఆక్రమిస్తున్నారన్నారు. పేద రైతుల నుంచి కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు . ఇందులో బిగ్ బ్రదర్స్ హస్తం ఉందన్నారు. అలైన్ మెంట్ మార్పు పై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు ప్రశాంత్ రెడ్డి.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రీజనల్ రింగ్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ట్రిపుల్ ఆర్ కోసం ఒక కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. కాగా మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డుపై రాజకీయాలు చేయొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. అలైన్ మెంట్ మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..