హంగేరీ టు లెబనాన్ వయా బల్గేరియా.. లెబనాన్ పేజర్ల పేలుళ్ల వెనుక ‘కేరళ’ వ్యక్తి హస్తం?

లెబనాన్‌లో ఏకకాలంలో పేజర్లు పేలి 12 మంది మృతి చెందగా, వేల సంఖ్యలో తీవ్రగాయాలుపాలైన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయిల్ దేశ నిఘా సంస్థ 'మొస్సాద్' హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. పేజర్లు పేలిన ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే వాకీటాకీలు సైతం ఏకకాలంలో పేలి ఆ దేశాన్ని మరింత దెబ్బతీశాయి.

హంగేరీ టు లెబనాన్ వయా బల్గేరియా.. లెబనాన్ పేజర్ల పేలుళ్ల వెనుక 'కేరళ' వ్యక్తి హస్తం?
Hezbollah pager blasts
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 21, 2024 | 11:53 AM

లెబనాన్‌లో ఏకకాలంలో పేజర్లు పేలి 12 మంది మృతి చెందగా, వేల సంఖ్యలో తీవ్రగాయాలుపాలైన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయిల్ దేశ నిఘా సంస్థ ‘మొస్సాద్’ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. పేజర్లు పేలిన ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే వాకీటాకీలు సైతం ఏకకాలంలో పేలి ఆ దేశాన్ని మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా ఆ దేశం కేంద్రంగా పనిచేస్తున్న ‘హెజ్బొల్లా’ గ్రూపు ఈ వరుస దాడులతో ఖంగుతిన్నది. ఇజ్రాయిల్ – లెబనాన్ (హెజ్బొల్లా) మధ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఈ చర్యలో నీతి, న్యాయం, ధర్మం సంగతి పక్కనపెడితే.. ఈ తరహాలో శత్రువులను దెబ్బతీయడం ప్రపంచంలో మొదటిసారిగా చోటుచేసుకుంది. ఇదెలా సాధ్యపడింది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తాయి. ఆ వివరాల్లోకి వెళ్తే…

గాజాతో మొదలై..!

గత ఏడాది ఇజ్రాయిల్ ప్రజలు తమ పండుగ వేడుకల్లో మునిగి తేలుతున్న సమయంలో గాజా నుంచి ‘హమాస్’ ఉగ్రవాదులు విరుచుకుపడి సృష్టించిన మారణహోమం యావత్ ప్రపంచం చూసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్స్ అంతకు మించిన మారణహోమాన్ని సృష్టించాయి. గాజాలోని ‘హమాస్’ సంస్థకు భావసారూప్యత కల్గిన ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సన్నిహిత సంబంధాలున్నాయి. హమాస్ తరహాలోనే లెబనాన్‌లో కూడా సాయుధ ఇస్లామిక్ గ్రూపు ‘హెజ్బొల్లా’ పనిచేస్తోంది. ఈ సంస్థకు ఉన్న సైనిక సంపత్తి ఒక చిన్న దేశం సైన్యంతో సమానం. ఇప్పుడు ఈ సంస్థ కూడా ఇజ్రాయిల్‌పై ఆయుధాలు ఎక్కుపెట్టింది. వరుసగా మిస్సైళ్లతో దాడులకు తెగబడింది. ఇజ్రాయిల్ రక్షణ కవచం అనేక మిస్సైళ్లను మధ్యలో ఆకాశంలోనే ధ్వంసం చేసినప్పటికీ.. కొన్ని నేలను చేరి విధ్వంసం సృష్టించాయి. అందులో ఫుట్‌బాల్ మైదానంలో మిస్సైల్ సృష్టించిన విధ్వంసంలో యువత, పసిపిల్లలు కూడా చనిపోయారు. ఈ ఘటన ఇజ్రాయిల్‌ను మరింత కోపోద్రిక్తం చేసింది. ఆ పర్యవసానమే లెబనాన్‌లో జరిగిన పేజర్, వాకీ-టాకీ పేలుళ్లు.

పేజర్లే ఎందుకు?

లెబనాన్‌తో పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఇజ్రాయిల్ ఆ దేశ సాయుధ హెజ్బొల్లా గ్రూపు కార్యాకలాపాలపై తమ నిఘా కొనసాగించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన ఇజ్రాయిల్ నిఘా విభాగం ‘మొస్సాద్’, హెజ్బొల్లా కార్యకలాపాలను పసిగడుతూ కౌంటర్ ఆపరేషన్లు చేపడుతూ వచ్చింది. పెగాసస్ వంటి అత్యంత శక్తివంతమైన నిఘా సాఫ్ట్‌వేర్ రూపకర్తలైన ఇజ్రాయిలీ దేశస్థులు సెల్‌ఫోన్లు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించడం తమ కదలికలను పసిగడుతున్నారని ‘హెజ్బొల్లా’ భావించింది. అందుకే కాలం చెల్లిన కమ్యూనికేషన్ వ్యవస్థ ‘పేజర్’ సేవలను మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చింది. సెల్‌ఫోన్లు రాకముందు పేజర్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు. వాటిని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా వినియోగించడం లేదు. కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చే సందేశం పేజర్లకు చేరుతుంది. తద్వారా మొస్సాద్ కళ్లుగప్పి తమ కార్యాకలాపాలను కొనసాగించవచ్చని హెజ్బొల్లా భావించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మొస్సాద్, వారికి సరఫరా చేసే పేజర్లను మధ్యలోనే తమ చేతుల్లోకి తీసుకుని, ప్రతి పేజర్‌లో అత్యాధునిక పేలుడు పదార్థం PETN (Pentaerythritol tetranitrate)ను అమర్చింది. ప్రతి పేజర్లో బ్యాటరీకి ఆనుకుని అమర్చిన 3 గ్రాముల PETN ఇంత విధ్వంసాన్ని సృష్టించింది.

హంగేరీ టూ లెబనాన్ వయా బల్గేరియా

ఏకకాలంలో పేలిన పేజర్లు ‘గోల్డ్ అపోలో’ సంస్థకు చెందిన AR-924 మోడల్ పేజర్లు. గోల్డ్ అపోలో సంస్థ తైవాన్ దేశానికి చెందినది. అయితే తమ ట్రేడ్‌మార్క్ లైసెన్సును ఉపయోగించుకునే అవకాశాన్ని హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తున్న బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ సంస్థకు ఇచ్చింది. ఆ సంస్థే AR-924 మోడల్ పేజర్లను తయారు చేసింది. వాటిని బల్గేరియా రాజధాని సోఫియా కేంద్రంగా పనిచేస్తున్న ‘నోర్టా గ్లోబల్’ సంస్థ సరఫరా చేసిందని కథనాలు వచ్చాయి. 2022లో ఈ సంస్థ రిజిస్టర్ చేసుకుంది. దీనిపై బల్గేరియా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయ. లెబనాన్‌లో పేలిన పేజర్ల తయారీ, ఎగుమతిలో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ఆ దేశం ప్రకటించింది. అయితే నోర్టా గ్లోబల్ సంస్థ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలియజేసింది.

కేరళ వ్యక్తి పాత్ర!

ఈ మొత్తం వ్యవహారంలో కేరళ వ్యక్తి పాత్ర ఏముంది అన్న సందేహం తలెత్తవచ్చు. బల్గేరియా రాజధాని సోఫియాలో నోర్టా గ్లోబల్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి కేరళలోని వాయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్. లెబనాన్‌కు సరఫరా చేసిన పేజర్లలో పేలుడు పదార్థాలతో పాటు బ్యాటరీని వెడెక్కించేలా మాల్‌వేర్, స్పైవేర్ అప్‌లోడ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే ఏకకాలంలో అన్ని పేజర్లను పేల్చడం సాధ్యపడిందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. అసలు ఇదంతా ఎలా జరిగిందన్నది దర్యాప్తు సంస్థలు తేల్చుతాయి. అయితే లెబనాన్‌కు చేరిన పేజర్లను సరఫరా చేసిన సంస్థ అధిపతి కేరళ వాసి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నార్వే పౌరసత్వం తీసుకుని ఆ దేశంలోనే స్థిరపడ్డ రిన్సన్ జోస్ గురించి అటు నార్వే, ఇటు బల్గేరియా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నోర్టా గ్లోబల్ సంస్థ తమ కన్సల్టింగ్ కార్యాకలాపాల ద్వారా యూరప్ బయట గత ఏడాది 725,000 డాలర్ల ఆదాయం సమకూర్చినట్టు పేర్కొంది.

రిన్సన్ జోస్ ఉన్నత చదువుల కోసం కేరళను వీడి నార్వే వెళ్లినట్టు తెలిసింది. చదువు పూర్తయ్యాక కొంత కాలం యూకే రాజధాని లండన్‌లో ఉద్యోగం చేసిన జోస్, మళ్లీ తిరిగి నార్వే రాజధాని ఓస్లోకి వెళ్లిపోయాడు. నార్వే ప్రెస్ గ్రూప్ DN మీడియాలో డిజిటల్ కస్టమర్ సపోర్ట్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు. నార్వేలోనే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. జోస్ కవల సోదరుడు లండన్‌లో ఉంటున్నాడు. అయితే పేజర్ల పేలుడు ఘటన తర్వాత నుంచి జోస్ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. తన సోదరుడు ముక్కుసూటి మనిషి అని, ఎలాంటి తప్పులు చేయడని, బహుశా ఎవరైనా ట్రాప్ చేసి ఉంటారని కవల సోదురుడు అభిప్రాయపడ్డాడు. మొత్తంగా కేరళలో పుట్టి నార్వేలో సెటిలైన రిన్సన్ జోస్ ఇప్పుడు లెబనాన్‌కు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!