AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ధూమ్ సినిమాను మించిన దొంగతనం ఇదేనేమో..! ఈ చోరీ స్టైల్ నెక్ట్స్ లెవల్ గురూ..

పోలీసులు దొంగలను పట్టుకోవడంలో సాధారణ ప్రజల నుండి సహాయం కోరారు. ఓ దొంగ దాదాపు 6 అడుగుల పొడవు, దాదాపు 30 ఏళ్లు, లేత నలుపు రంగు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. రెండవ దొంగ 5 అడుగుల 8 అంగుళాల పొడవు, సన్నగా, ముదురు నలుపు రంగుతో ఉంటాడు. మూడో గుర్తుతెలియని నిందితుడు

Viral Video: ధూమ్ సినిమాను మించిన దొంగతనం ఇదేనేమో..! ఈ చోరీ స్టైల్ నెక్ట్స్ లెవల్ గురూ..
Atlanta Police
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2024 | 9:11 PM

Share

దొంగల భయంతో ఇళ్లు, దుకాణాల్లో సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు.. కానీ, ఈ కెమెరాలు వచ్చాక దొంగతనాల ఘటనలు తగ్గడమే కాకుండా మరింత ఎక్కువయ్యాయనిపిస్తుంది. దొంగలు తమకు కావలసిన దాని కోసం ఎలాగోలా తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఇండ్లు, భవనాలు, దుకాణాలు, బ్యాంకులు ఇలా ఎక్కడపడితే అక్కడ తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ టార్గెట్‌ కంప్లీట్‌ చేస్తున్నారు. అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్ దొంగతనానికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. అట్లాంటా చెక్ క్యాషర్స్ భవనంలోకి ముసుగు దొంగలు చొరబడ్డారు. ఉద్యోగిని బెదిరించి రూ.1.5 కోట్లతో పరారైన దొంగల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియోలో ఒక సిబ్బంది కొన్ని పత్రాలతో లాబీ గుండా వెళుతుండగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి టెర్రస్ నుండి కిందకు దూకాడు. సిబ్బంది భయంతో కిందపడిపోతున్నారు. మొదటి దొంగ కిందకు రాగానే సిబ్బందిని బెదిరించి, రెండో దొంగ కూడా పైకప్పు నుంచి కిందకు ల్యాండ్‌ అయ్యాడు. ఈ సమయంలో ఓ కస్టమర్ కూడా దుకాణానికి రావడంతో దొంగలు సిబ్బందిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ దొంగలు సేఫ్ తెరవమని సిబ్బందిని అడుగుతారు. సేఫ్ తెరిచిన వెంటనే, వారు 1,50,000 US డాలర్లు (1,25,35,500 భారత రూపాయిలు) తీసుకుని, సిబ్బందిని బాత్రూంలోకి లాక్కెళ్లారు. అయితే వారు వెళ్లిపోతుండగా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తికి దొంగల్లో ఒకరి ముఖం కనిపించడం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, అట్లాంటా పోలీసులు దొంగలను పట్టుకోవడంలో సాధారణ ప్రజల నుండి సహాయం కోరారు. ఓ దొంగ దాదాపు 6 అడుగుల పొడవు, దాదాపు 30 ఏళ్లు, లేత నలుపు రంగు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. రెండవ దొంగ 5 అడుగుల 8 అంగుళాల పొడవు, సన్నగా, ముదురు నలుపు రంగుతో ఉంటాడు. మూడో గుర్తుతెలియని నిందితుడు రెండు డోర్ల పికప్ ట్రక్కును నడుపుతున్నాడని, అందులో నిందితులు పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ వీడియోపై పలువురు వ్యాఖ్యానిస్తూ.. ఇప్పుడు ఇలాంటి చోరీ ఘటనలు సర్వసాధారణమైపోయాయని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..