Health Tips: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం..! మరెన్నో ప్రయోజనాలు..

జీలకర్ర.. ప్రతి వంటింట్లో ఉండే ఒక ముఖ్యమైన మసాల దినుసు.. దాదాపు అన్ని వంటల్లో దీనిని ఉపయోగిస్తారు. దీనివల్ల రుచి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని కలోంజి సీడ్స్‌ అని కూడా పిలుస్తారు..అయితే జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda

|

Updated on: Sep 20, 2024 | 6:41 PM

నల్లజీలకర్రతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే నల్ల జీలకర్ర నీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

1 / 5
నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగనివ్వకుండా నివారిస్తుంది. అధిక బరువు, కడుపు ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది.

2 / 5
నల్ల జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తూ టైప్‌-2 డయాబెటిస్‌ని అదుపు చేస్తుంది. నల్ల జీలకర్ర నూనెని బ్లాక్‌ టీతో కలిపి కాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు గుండెకి సంబంధించిన సమస్యలను ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.  మెటబాలింజను మెరుగుపర్చడంలో నల్లజీలకర్ర తోడ్పడుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.

4 / 5
నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఆడవాళ్లకు నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. పీరియడ్స్‌ టైంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది.

5 / 5
Follow us