టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరుపున 3వ నంబర్‌లో చెతేశ్వర్ పుజారా మరోసారి బ్యాటింగ్ ప్రారంభిస్తే.. టీమ్ ఇండియాకు మరింత బలం చేకూరుతుంది. గతంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా తరపున టెస్టు క్రికెట్‌లో చెతేశ్వర్ పుజారా అద్భుతాలు చేశాడు. ఛెతేశ్వర్ పుజారా 103 టెస్టు మ్యాచ్‌లలో 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్‌కు టెస్టు జట్టులో ఛెతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోతే.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆస్ట్రేలియా క్లిష్ట పరిస్థితుల్లో, చెతేశ్వర్ పుజారా లేకుండా వెళ్లడం ప్రమాదకరమే.