- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN: Team India Player Shubman Gill Breaks Virat Kohli's Century Record in WTC
IND vs BAN: 5 సెంచరీలు.. 1500లకుపైగా పరుగులు.. కట్‌చేస్తే.. కోహ్లీకే ఇచ్చిపడేసిన టీమిండియా ఫ్యూచర్ స్టార్
Shubman Gill: టెస్టు క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు 48 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 6 అర్ధ సెంచరీలు, 5 సెంచరీలతో 1500కు పైగా పరుగులు చేశాడు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీ నెలకొల్పిన ప్రత్యేక రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
Updated on: Sep 21, 2024 | 5:42 PM

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ పేసర్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 2వ ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చిన గిల్ 161 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

అంతకుముందు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో మొత్తం 62 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి.. 4 సెంచరీలు చేసి ఈ రికార్డును లిఖించాడు. తాజాగా 5వ సెంచరీతో కోహ్లిని అధిగమించాడు శుభ్‌మన్ గిల్.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 48 ఇన్నింగ్స్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 5 సెంచరీలు చేశాడు. దీంతో డబ్ల్యూటీసీ సిరీస్‌లో అత్యధిక సెంచరీ చేసిన 2వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో హిట్‌మ్యాన్ 56 ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొత్తం 9 సెంచరీలు చేశాడు. ఇలా చేయడం ద్వారా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో అత్యధిక సెంచరీ చేసిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రికార్డు సృష్టించాడు. డబ్ల్యూటీసీ సిరీస్‌లో 106 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్ 16 సెంచరీలతో మొత్తం 4973 పరుగులు చేశాడు. దీంతో సెంచరీ రికార్డుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.




