AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనాలను పిచోళ్లను చేస్తున్న జూ నిర్వాహకులు.. కుక్కలకు రగులేసి.. ఇలా

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పాండాలు వుహాన్ ల్యాబ్‌లో తయారు చేసినట్లుగా కనిపిస్తున్నాయని చాలా మంది వ్యాఖ్యనించారు. చైనా కాపీయింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు. చైనా అందరినీ మోసం చేయడానికి పని చేస్తుందని, ఇప్పుడు తన పర్యాటకులను కూడా మోసం చేస్తుందని మరొకరు రాశారు.

జనాలను పిచోళ్లను చేస్తున్న జూ నిర్వాహకులు.. కుక్కలకు రగులేసి.. ఇలా
China Zoo Painted Dogs Like
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2024 | 8:01 PM

Share

జంతు ప్రదర్శనశాలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిన్న పాండాలు చూసేందుకు చాలా అందంగా కనిపిస్తున్నాయి. సందర్శకులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాండాలను చూసి ఆనందపడుతున్నారు. బుల్లి బుల్లి పాండాలు అందంగా ఆడుకుంటుంటే.. చూసేందుకు డబ్బు ఖర్చుపెట్టి మరీ క్యూ కడుతున్నారు ప్రజలు. కానీ, ఇవి పాండాలు కాదు కుక్కలని ఆ తర్వాత తెలిసింది. అవును మీరు విన్నది నిజమే.. ప్రముఖ ఫేమస్‌ జూలో కుక్కలకు రంగు వేసి నకిలీ పాండాలను తయారు చేసి సందర్శకుల నుంచి డబ్బు వసూలు చేస్తోంది. ఇలాంటి నకిలీ పని చేసింది ఎవరు..? ఎంటా కథ పూర్తి వివరాల్లోకి వెళితే…

పొరుగు దేశం చైనా అద్భుతాలను ఆవిష్కరించటంలో దిట్ట..అంతేకాదు.. ఈ దేశంలో డూప్లికేట్‌ ఎలాక్ట్రానిక్‌ పరికరాలు తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు చైనాలోని ఓ జూ నుండి ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్త చదివాక నవ్వాలా లేక ఆశ్చర్యపోవాలా అనే ఆలోచనలో పడిపోతారు. చైనాకు చెందిన షాన్వీ జూలో కనిపించిన ఈ షాకింగ్‌ సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక్కడి జూ నిర్వాహకులు కుక్కలకు రంగు వేసి నకిలీ పాండాలను తయారు చేశారు. అవి పాండాలుగా అనుకున్న పర్యాటకులు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. ఇంతలోనే ఆ కుక్కలు మొరగడంతో పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. మొరిగిన ఈ కుక్కల గురించిన నిజం బయటపడింది. ఇది గమనించిన పర్యాటకులు వెంటనే అదంతా వీడియో రికార్డ్ చేసారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్ అవుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు దానిపై స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

చైనా పాండాలకు ప్రసిద్ధి. కానీ ఒక జూలో పాండాలు లేవు. దాంతో జూ యజమానులు ఇలాంటి ప్లాన్‌ వేశారు. రెండు అందమైన కుక్కలను పట్టుకుని, వాటిని సరిగ్గా పాండాలుగా తీర్చిదిద్దారు. వాటి జుట్టును అందంగా కత్తిరించారు. వాటి ముఖాలకు హెయిర్ డైతో రంగులు వేయించారు. దీంతో వాటిని చూసిన వెంటనే ఎవరైనా సరే ఇట్టే పొరపాటు పడిపోతారు. వాటిని పాండాలుగా నమ్మేస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పాండాలు వుహాన్ ల్యాబ్‌లో తయారు చేసినట్లుగా కనిపిస్తున్నాయని చాలా మంది వ్యాఖ్యనించారు. చైనా కాపీయింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు. చైనా అందరినీ మోసం చేయడానికి పని చేస్తుందని, ఇప్పుడు తన పర్యాటకులను కూడా మోసం చేస్తుందని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్