Viral Video: వామ్మో.. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై 6అడుగుల పాము ప్రత్యక్షం.. ప్రయాణికులు పరుగో పరుగు..

భారీ పొడవైన పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పామును చూసిన భయంతో అక్కడ్నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్‌ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న మిగతా వారిని అప్రమత్తం చేశారు. ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ చివరకు..

Viral Video: వామ్మో.. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై 6అడుగుల పాము ప్రత్యక్షం.. ప్రయాణికులు పరుగో పరుగు..
Big Snake On Railway Station
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 20, 2024 | 5:06 PM

రైల్వే స్టేషన్‌లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే ప్లాట్‌ఫాంపై పాము పరిగెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే, రైల్వే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు వెళుతున్నారు. మరికొందరు రైలు దిగి తమ తమ ఇళ్లు, కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇలా ఎవరి పనలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ప్లాట్‌ఫాం నంబర్-1లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆ తరువాత ఏం జరిగిందో వైరల్‌ వీడియోలో చూడాల్సిందే..! కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై శుక్రవారం ఉదయం ఆరడుగుల ఒక పెద్ద పాము కనిపించింది. భారీ పొడవైన పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పామును చూసిన భయంతో అక్కడ్నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్‌ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న మిగతా వారిని అప్రమత్తం చేశారు. ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరలయ్యింది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పాము ప్రత్యక్షమైన సంగతి అటవీ శాఖకు తెలియజేయడానికి ముందే ఆ పాము ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్లిపోయింది. పాము కనిపించకుండా పోయిన తర్వాత కూడా ప్రయాణికులు భయంతో ఉండిపోయారు. ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లడం కూడా మానేశారు. ఆ సమయంలో ఏ రైలు ప్లాట్‌ఫారమ్ నంబర్ 1కి చేరుకోకపోవడం విశేషం. అయితే ఎవరికీ ఎలాంటి హానీ కలగకుండా పాము ప్లాట్‌ఫారమ్‌పై నుంచి మాయమైపోయిందంటే ఎక్కడో నక్కి ఉంటుందని, జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు పలువురు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..