Watch: కాకికి సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
హిందువులు ఆవును తల్లిగా భావించినట్లే, కాకులను పూర్వీకులుగా భావించి ఆహారం అందిస్తారు. వినాయక చవితి అనంతరం పితృ పక్షం జరుగుతోంది. ఈ సమయంలో కాకుల రూపంలో తమ పూర్వీకులే ఇంటికి వస్తారని నమ్ముతారు. అలాంటి కాకి ఒకటి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, పోలీస్ అధికారి ఒకరు దానికి ప్రాణం పోశారు.
ఈ భూమిపై మనుషులే కాకుండా వేల, లక్షల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పరిమితుల్లో జీవిస్తారు. ప్రకృతిలో ఉన్న జీవుల్లో కొన్ని జీవరాశులకు మనుషులకు దగ్గరి సంబంధాలు కూడా ఉన్నాయి. మనం పూజించే కొన్ని చెట్లు, జంతువులు, పక్షులు ఉన్నాయి. మన జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. హిందువులు ఆవును తల్లిగా భావించినట్లే, కాకులను పూర్వీకులుగా భావించి ఆహారం అందిస్తారు. వినాయక చవితి అనంతరం పితృ పక్షం జరుగుతోంది. ఈ సమయంలో కాకుల రూపంలో తమ పూర్వీకులే ఇంటికి వస్తారని నమ్ముతారు. అలాంటి కాకి ఒకటి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, పోలీస్ అధికారి ఒకరు దానికి ప్రాణం పోశారు.
వైరల్ వీడియోలో ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ అధికారి కాకి ప్రాణాలను కాపాడుతున్న దృశ్యం ప్రజల్ని కదిలించింది. పోస్ట్‌లో ఇచ్చిన క్యాప్షన్ ప్రకారం, ఈ సంఘటన కోయంబత్తూరులో జరిగిందని సమాచారం. విద్యుదాఘాతానికి గురైన కాకి ఒకటి నేలమీద పడిపోయింది. నొప్పితో మెలికలు తిరుగుతూ సొమ్మసిల్లిపోయింది. చూస్తుండగానే అది అచేతనంగా పడిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక ఉద్యోగి ఒకరు వెంటనే దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.. పైకి లేపి దానికి CPR ఇచ్చి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశాడు.
ఈ వీడియో చూడండి..
कोयंबटूर में अग्निशमन और बचाव सेवा के एक अधिकारी ने बिजली का झटका लगने के बाद नीचे गिरे कौए की CPR देकर जान बचाई। #CPR #ViralVideo #Crow pic.twitter.com/bwmYbiR01V
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 20, 2024
కాకికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఓ పోలీస్ అధికారి.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం 10 సెకన్ల నిడివి గల ఈవీడియోలో ఆ ఉద్యోగి తన నోటి ద్వారా కాకికి శ్వాస అందించడం కనిపించింది. దాంతో ఆ కాకి మళ్లీ ప్రాణం పోసుకుంది. కాకిని కాపాడిన ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ అధికారి ఔదార్యానికి ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. X ఖాతాలో షేర్ చేసిన ఈ క్లిప్‌పై ప్రజలు అగ్నిమాపక అధికారిని ప్రశంసించారు. ఇది నిజమైన జంతు సేవ అని, జెండాలు ఎత్తడం కంటే ఆపదలో ఉన్న జంతువును చూసిన వెంటనే సహాయం చేయడం మంచిదని పలువురు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..