అరుదైన బాల రాముడి ఆకారం..! శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అద్భుతం
ప్రతిఏటా షరాఫ్ బజార్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం విశేష పూజలు చేసిన తర్వాత 108 కేజీల పులిహోరతో స్వామి వారికి ప్రత్యేక పూజాదికాలు
అది తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం..అక్కడ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహా సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం పెద్ద పెద్ద బుట్టల్లో పులిహోర తీసుకొచ్చారు. మహా సుదర్శన హోమం తిలకించిన భక్తులు బుట్టల్లో తరలి వచ్చిన పులిహోరను ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు. అనంతరం అర్చకులు 108 కేజీల పులిహోరను స్వామి వారి ఎదుట రాశిగా పోసి తిరుప్పావడ సేవ చేశారు. ఆ తర్వాత పులిహోరకు ఒక ఆకారాన్ని తీసుకొచ్చారు.
పులిహోరపై వివిధ రకాల పండ్లు, డ్రై పూట్స్ అమర్చి బాలాంజనేయ ఆకారంగా మార్చారు. ఉత్సవ విగ్రహాల ముందు పులిహోరతో చేసిన బాలాంజనేయ స్వామిని చూస్తూ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం అర్చకులు అర్చనాధికైంకర్యాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు మహా సుదర్శన హోమం నిర్వహించినట్లు అనంతరం పులిహోరతో బాల రాముడి రూపుకు విశేష పూజలు చేసినట్లు పూజారులు తెలిపారు. ఈ ఆకారాన్ని, పూజలు,హోమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రతిఏటా షరాఫ్ బజార్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం విశేష పూజలు చేసిన తర్వాత 108 కేజీల పులిహోరతో స్వామి వారికి ప్రత్యేక పూజాదికాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఎంతోమంది పట్టణానికి చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.