గణేష్ దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు !! దైవ మహిమే అంటున్న భక్తులు
గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చేశాయి. నవరాత్రులు మూడో రోజునుంచే దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించిన పార్వతీ నందనుడిని భారీ ఊరేగింపుతో గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ గణేష్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణేషుని ఆదివారం వరకూ పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చేశాయి. నవరాత్రులు మూడో రోజునుంచే దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించిన పార్వతీ నందనుడిని భారీ ఊరేగింపుతో గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ గణేష్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణేషుని ఆదివారం వరకూ పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఇక మంగళవారం నిమజ్జనం నేపథ్యంలో ఆ ఏర్పాట్లు చేసే క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి మహాగణపతి దర్శనాలు నిలిపివేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణనాథులను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో గణపతిని దర్శించుకునేందుకు ఓ నాగుపాము కూడా వచ్చింది. అవును మీరు విన్నది నిజమే. జగిత్యాల పట్టణం వానినగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి 40 అడుగుల మహా గణపతి మంటపం వద్ద నాగు పాము దర్శనం ఇచ్చింది. సోమవారం ఉదయం గణేష్ మంటపానికి ఓ భక్తుడు దర్శనానికి వచ్చే సరికి మంటపంలో నాగుపాము కనపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శోభాయాత్రలో స్టెప్పులు వేశాడు.. ఇంటికెళ్లి కూప్పకూలాడు
భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్.. ఏ కూరైనా కేజీ వందే