ఓలా.. ఎందుకిలా ?? స్కూటీతో యువతి వినూత్న నిరసన !!
వినియోగదారులు తమకు ఎదురైన అనుభవాలను వ్యక్తపరచడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తాము కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత బాగా లేకపోతే వినియోగదారుల ఫారంలో ఫిర్యాదు చేస్తారు. లేదా సదరు సంస్థపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇటీవలే ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఓలా బైక్‌కు మరమ్మతులు చేయించి ఇవ్వడం లేదని ఏకంగా షోరూమ్‌కు నిప్పు పెట్టాడు.
వినియోగదారులు తమకు ఎదురైన అనుభవాలను వ్యక్తపరచడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తాము కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత బాగా లేకపోతే వినియోగదారుల ఫారంలో ఫిర్యాదు చేస్తారు. లేదా సదరు సంస్థపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇటీవలే ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఓలా బైక్‌కు మరమ్మతులు చేయించి ఇవ్వడం లేదని ఏకంగా షోరూమ్‌కు నిప్పు పెట్టాడు. ఈ చర్య చట్ట విరుద్దమని తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ పని చేసిన తర్వాత అతను పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా తాజాగా మరో ఓలా కస్టమర్ తన నిరసనను వినూత్నంగా వ్యక్త పరిచారు. తాను కొనుగోలు చేసుకున్న స్కూటర్ ప్రతిసారీ పాడవుతున్నా ఓలా సంస్థ స్పందించడం లేదని ఒక యువతి ఆరోపిస్తూ నిరసనకు దిగింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, సంస్థ ప్రతినిధులు స్కూటర్‌ను రిపేర్ చేయడం లేదని ఆరోపించింది. తన ఆవేదదను వ్యక్తపరుస్తూ ఓ కాగితంపై రాసి దానిని స్కూటీపై అతికించింది. ఈ ఫొటోను సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో ఈ పోస్ట్ కాస్త చివరికి ఓలా దృష్టిలో పడింది. దీంతో సంస్థ ప్రతినిధులు స్పందించారు. వాహనాన్ని రిపేర్ చేసేందుకు తీసుకువెళుతూ, అప్పటి వరకు నడుపుకొనేందుకు ఆమెకు తాత్కాలికంగా ఒక వాహనాన్ని అందించి వెళ్లారు. వరుసగా జరుగుతోన్న ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

