శోభాయాత్రలో స్టెప్పులు వేశాడు.. ఇంటికెళ్లి కూప్పకూలాడు
నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడ్డవారికే గుండెపోటు గండం. కానీ... ఇప్పుడు గుండెపోటుకు వయసు తేడాల్లేవు. చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించినవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతారు. ఇక సెలవంటూ వెళ్లిపోతున్నారు.
నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడ్డవారికే గుండెపోటు గండం. కానీ… ఇప్పుడు గుండెపోటుకు వయసు తేడాల్లేవు. చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించినవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతారు. ఇక సెలవంటూ వెళ్లిపోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా? డాన్సులు, ఆటల్లో బాగా అలసిపోతే.. ఆ ఎఫెక్ట్ ఇమ్మీడియట్‌గా హార్ట్‌పై పడుతోందా? అంటే తాజాగాజరిగిన ఈ ఘటన చూస్తే.. ఇలాంటి టెన్షనే వస్తోంది. వినాయక నిమజ్జనం సందర్భంగా అప్పటివరకూ శోభాయాత్రలో స్టెప్పులు వేసిన వ్యక్తి.. ఇంటికెళ్లి కుప్పకూలిపోయాడు.. హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.. ఇదే ఇప్పుడు షాకింగ్‌గా మారింది. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురికాలనీలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి అల్కాపురి కాలనీ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న శ్యామ్‌ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతి చెందారు. అల్కాపురి టౌన్‌షిప్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం దగ్గర లడ్డూ వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలం పాటలో లడ్డూ కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్‌మార్ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ ఒక్కసారి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్.. ఏ కూరైనా కేజీ వందే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

