భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్.. ఏ కూరైనా కేజీ వందే
వర్షాలు ఆగాయి.. వరదలు తగ్గాయి. సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. కూరగాయాల ధరలు కొండెక్కడంతో నోట్లోకి నాలుగు మెతుకులు పోయే పరిస్థితి లేదంటూ ప్రజలు లబోధిబోమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో.. దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి..
వర్షాలు ఆగాయి.. వరదలు తగ్గాయి. సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. కూరగాయాల ధరలు కొండెక్కడంతో నోట్లోకి నాలుగు మెతుకులు పోయే పరిస్థితి లేదంటూ ప్రజలు లబోధిబోమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో.. దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి. ఈసీజన్‌లో అందరికి అందుబాటులో ఉండే కూరగాయాలు, ఆకుకూరల ధరలు.. భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ముందుముందు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. దీంతో కూరగాయల సాగు దెబ్బ తీసింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలచోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని కోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అన్ని రకాల కూరగాయాల ధరలు నలభై శాతం వరకు పెరిగాయి. పచ్చి మిర్చి కిలోకి 90.. చిక్కుడు కిలో 100, బెండకాయ 100, క్యారెట్ వంద, కాకరకాయ 90, క్యాలీఫ్లవర్ 80, అకుకూరలు కట్ట 20, కొత్తిమీర, పుదీనా కట్ట 50నుంచి 100 పలుకుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

