పాసింగ్ అవుట్ పరేడ్ కు వచ్చిన తల్లికి ఎస్ఐ పాదాభివందనం
తల్లిని మించిన దైవం లేదు అంటారు.. కనిపించని దైవం కంటే కని.. పెంచే.. అమ్మ ఆశీర్వాదానికి శక్తి ఎక్కువ. బిడ్డ క్షేమం కోసం, భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టేందుకు వెనకాడదు తల్లి. ప్రస్తుత కాలంలో అలాంటి తల్లిదండ్రులు ఎందరో కన్నబిడ్డలకు బరువై అనాథులుగా మారుతున్న ఘటనలు కోకొల్లలు. కానీ అందరూ అలా ఉండరు. అమ్మను దైవంగా భావించే బిడ్డలూ ఉంటారు. కొడుకు ఎంత ఎదిగినా తల్లికి పసివాడుగానే కనిపిస్తాడు.. ఆ బిడ్డ కూడా అమ్మ దగ్గరకు రాగానే బాలుడిలా మారిపోతాడు.
తల్లిని మించిన దైవం లేదు అంటారు.. కనిపించని దైవం కంటే కని.. పెంచే.. అమ్మ ఆశీర్వాదానికి శక్తి ఎక్కువ. బిడ్డ క్షేమం కోసం, భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టేందుకు వెనకాడదు తల్లి. ప్రస్తుత కాలంలో అలాంటి తల్లిదండ్రులు ఎందరో కన్నబిడ్డలకు బరువై అనాథులుగా మారుతున్న ఘటనలు కోకొల్లలు. కానీ అందరూ అలా ఉండరు. అమ్మను దైవంగా భావించే బిడ్డలూ ఉంటారు. కొడుకు ఎంత ఎదిగినా తల్లికి పసివాడుగానే కనిపిస్తాడు.. ఆ బిడ్డ కూడా అమ్మ దగ్గరకు రాగానే బాలుడిలా మారిపోతాడు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తాజాగా బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో శిక్షణ పూర్తి చేసుకున్న ఓ ఎస్ఐ… పాసింగ్ అవుట్ పరేడ్ చూడ్డానికి అతని తల్లి వచ్చింది. తల్లిని చూడగానే ఆ ఎస్‌ఐ పరుగున వచ్చి తన తలపై ఉన్న టోపీ తీసి అమ్మ తలపై పెట్టి, ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ ఘటన చూపరులను కదిలించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు మరెక్కడా లేవు
గణేష్ దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు !! దైవ మహిమే అంటున్న భక్తులు
శోభాయాత్రలో స్టెప్పులు వేశాడు.. ఇంటికెళ్లి కూప్పకూలాడు

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో

మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు

గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో

పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో

వాష్ రూమ్లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో

పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ..

ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
