భోజనం తర్వాత ఈ చిన్న గింజలు కాస్త నోట్లో వేసుకుంటే చాలు.. మధుమేహానికి కళ్లెం..!
మధుమేహం సాధారణ వ్యాధిగా మారుతోంది. వృద్ధులే కాదు యువత కూడా దీని బారిన పడుతున్నారు. శరీరంలో మధుమేహం లక్షణాలు కనిపించగానే బాధితులు ఏం తినాలి, ఏం తినకూడదు అనే లెక్కలు వేయడం మొదలుపెడతారు. డయాబెటిస్‌లో మనం తినే ఆహారం రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న వెంటనే రక్తంలో చక్కెర పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆహారంతో పాటు ఆహారం తిన్న తర్వాత ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి.