AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: ఒమిక్రాన్ తో మరిన్ని కొత్త వెరియంట్స్.. నిపుణుల హెచ్చరిక ఇదీ..పూర్తి వివరాలు..

Omicron Variant in World: కరోనావైరస్ (Corona Virus)కొత్త ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ ఇన్ఫెక్షన్ అని అంటున్నారు. అయితే ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి..

Omicron Variant: ఒమిక్రాన్ తో మరిన్ని కొత్త వెరియంట్స్.. నిపుణుల హెచ్చరిక ఇదీ..పూర్తి వివరాలు..
Surya Kala
|

Updated on: Jan 16, 2022 | 12:46 PM

Share

Omicron Variant in World: కరోనావైరస్ (Corona Virus)కొత్త ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ ఇన్ఫెక్షన్ అని అంటున్నారు. అయితే ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి ఎప్పటికి ముగుస్తుందన్న ప్రశ్న మొదలైంది. ఇదే సమయంలో.. రాబోయే కాలంలో కొత్త వేరియంట్ లో మరిన్ని వైవిధ్యాలను చూడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బోస్టన్ యూనివర్శిటీకి చెందిన ఎపిడిమాలజిస్ట్ లియోనార్డో మార్టినెజ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, అంత ఎక్కువగా రూపాంతరం చెందుతుందని.. అప్పుడు అనేక రకాల వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే (Omicron) ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.

మార్టినెజ్ మాట్లాడుతూ, తదుపరి వేరియంట్ రాకను నిర్ధారించడానికి లేదా అంచనా వేయడానికి మార్గం లేదని చెప్పారు. అయితే భవిష్యత్ రూపాంతరాలు చిన్న అనారోగ్యానికి కారణమవుతాయని అయితే ఎటువంటి హామీ లేదని అన్నారు లియోనార్డో మార్టినెజ్. ‘ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుదండంతో మ్యుటేషన్‌కు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. దీని వల్ల మరిన్ని వేరియంట్‌లు తెరపైకి వచ్చే ప్రమాదం ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ స్టువర్ట్ కాంప్‌బెల్ రే మాట్లాడుతూ.. వైరస్ ఇలా రూపాంతరం చెందడానికి ప్రత్యెక కారణం అంటూ ఏమీ లేదు. కాలక్రమేణా వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరని తాను అనుకోవడం లేదన్నారు.

ది గార్డియన్‌ నివేదిక ప్రకారం.. బ్రిటన్‌లోని సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ వేసవి ప్రారంభంలో కొత్త ఒమిక్రాన్ కేసులను చూస్తుందని అంచనా వేసింది. ప్రజలు మళ్ళీ సామజిక కార్యకలాపాలలో పాల్గొనడం వలన ఇది జరుగుతుందని.. అప్పుడు మళ్ళీ కొత్త కేసులు పెరుగుతాయిని అంచనా వేసింది.

ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నెక్స్ట్ ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..!

1. ఒమిక్రాన్ కారణంగా ప్రజలు మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. డెల్టా లేదా గతంలోని ఏదైనా ఇతర వైరల్ వ్యాధులు సోకిన వ్యక్తులలో లేదా ఒమిక్రాన్ బాధితులుగా మారిన వ్యక్తులలో మళ్లీ వైరస్ బారిన పడవచ్చు.

2. సాధారణ జలుబు లాగా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఒమిక్రాన్ వైరస్ ప్రాణాంతక వైరస్ కాకపోవడంతో.. భవిష్యత్ లో పుట్టే వైరస్ లు ప్రాణాంతకంగా మారే అవకాశం లేదు.

3. వేరియంట్ ముఖ్యమైన పని తనలాంటి ఇతర రూపాంతరాలను సృష్టించడం. ఇది చాలా సులభం. వాస్తవానికి, ఒక వ్యక్తికి తేలికపాటి లక్షణాలతో వైరస్ సంక్రమిస్తే, అతనికి తెలియకుండానే ఇతర వ్యక్తులకు సోకవచ్చు. ఇది ఆ వ్యక్తుల శరీరంలో కొత్త వైవిధ్యాలను పుట్టించే ప్రమాదం అధికంగా ఉంది

4. కరోనావైరస్.. కొత్త రకాలుగా వ్యాప్తించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వైరస్ బారిన ఒక జంతువు కొత్త రకాల వైరస్ లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

5. Omicron గురించిన అతిపెద్ద భయం ఏమిటంటే అది డెల్టా వేరియంట్‌తో కలవకపోవడం.. దీంతో ఒమిక్రాన్ నుంచి సరికొత్త వేరియంట్‌ పుట్టుకకు దారి తీస్తుంది. అప్పుడు రెండు వేరియంట్‌ల లక్షణాలను కలిగి ఉంటుంది.

Also Read:

Telangana Corona: తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా.. మళ్లీ కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్న సర్కార్‌.. కేసీఆర్‌ కీలక భేటీ