Telangana Corona: తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా.. మళ్లీ కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్న సర్కార్‌.. కేసీఆర్‌ కీలక భేటీ

Telangana Corona: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్‌..

Telangana Corona: తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా.. మళ్లీ కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్న సర్కార్‌.. కేసీఆర్‌ కీలక భేటీ
Follow us
Subhash Goud

|

Updated on: Jan 16, 2022 | 10:49 AM

Telangana Corona: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్‌, మరోవైపు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. ఈనెల 17వ తేదీన (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

ఇక రాష్ట్రంలో కొత్తగా 1963 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,07,162 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,054 మంది కరోనాతో మృతి చెందారు. ఇక నిన్న కరోనా నుంచి 1620 మంది కోలుకోగా, 22,017 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1075 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Holidays Extension: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యా సంస్థల సెలవులు పొడిగింపు

Coronavirus: స్కూళ్లు తిరిగి ప్రారంభ‌మైన త‌ర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమ‌తి.. కీల‌క నిర్ణ‌యం.