Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holidays Extension: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యా సంస్థల సెలవులు పొడిగింపు

Holidays Extension: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోంది. ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులతో..

Holidays Extension: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యా సంస్థల సెలవులు పొడిగింపు
Ts Schools
Follow us
Subhash Goud

|

Updated on: Jan 16, 2022 | 2:09 PM

Holidays Extension: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోంది. ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులతో ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ప్రభావం ముందుగా విద్యాసంస్థలపై పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు ఈనెల 30 వరకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదట విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు ఉండగా, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈనెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వైపు కోవిడ్‌ కేసులు.. మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాతో కేసులు తీవ్రతరం అవుతున్న దృష్ట్యా విద్యార్థులకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సూచించింది.  దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమావేశం సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో మరోసారి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు విద్యాసంస్థలు కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు ఉంటాయని విద్యార్థులకు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై ఇంకా ప్రభుత్వం అధికారికంగా గైడ్‌ లైన్‌ ఇవ్వలేదు. కేవలం సెలవులను మాత్రమే ఈనెల 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 15-18 ఏళ్ల విద్యార్థులకు వ్యాక్సిన్‌ వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Ts Go

ఇవి కూడా చదవండి:

Hyderabad Rains: భాగ్యనగర వాసులను పలకరించిన వరుణుడు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మరింతగా చల్లబడిన నగరం

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు