Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో చైనా వ్యూహం పని చేయదు.. కీలక ట్విట్‌ చేసిన దక్షిణాఫ్రికా వైరాలజిస్ట్‌

Omicron Variant: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసింది. కరోనా కట్టడికి..

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో చైనా వ్యూహం పని చేయదు.. కీలక ట్విట్‌ చేసిన దక్షిణాఫ్రికా వైరాలజిస్ట్‌
Omicron
Follow us

|

Updated on: Dec 26, 2021 | 7:19 PM

Omicron Variant: కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది దాదాపు రెండేళ్లు కావస్తోంది. తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ , ఇతర ఆంక్షలు కారణంగా ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ప్రపంచ దేశాలన్నింటికి పాకుతోంది. ఇక కరోనా కట్టడికి చైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే కరోనా కట్టడికి జీరో కోవిడ్‌ వ్యూహాన్ని అనుసరిస్తున్న చైనా.. ఒమిక్రాన్‌ విషయంలో ఈ విధానం పని చేయదని దక్షిణాఫ్రికాలోని సెంటర్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌, వైరాజలిస్ట్‌ తులియో డి ఒలివెరా తెలిపారు.

బీటాతోపాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కనుగొన్న దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల బృందానికి ఆయన సారధ్యం వహిస్తున్నారు. తాజాగా ఓ ట్విట్‌ చేశారు. ఒమిక్రాన్‌ జీరో కోవిడ్‌ విధానంతో చైనా దేశానికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. కరోనా కట్టడికి చేపట్టే చర్యల కోసం ఇతర దేశాలతో కలవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా చైనా తన అధికారులను, ప్రజలను, విదేశీయులను శిక్షించకూడదని చెప్పుకొచ్చారు.

ఇటీవల చైనాలోని జియాన్‌ నగరంలో ఒక్క రోజే 50కిపైగా కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇక కరోనా కట్టడిలో విఫలమయ్యారని అధికారులపై కూడా వేటు వేశారు. తాజాగా ఒలివెరా ట్వీట్‌పై సంచలనంగా మారింది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో చైనా అప్రమత్తం అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Omicron variant: దేశంలో న్యూ వేరియంట్‌ పంజా.. 459కి చేరిన కేసుల సంఖ్య

Omicron: అనంతలో ఒమిక్రాన్‌ కలకలం.. ఒకరికి నిర్ధారణ.. మరో ఐదుగురి రిజల్ట్స్ కోసం నిరీక్షణ.. ఆందోళనలో జిల్లా వాసులు..