Omicron variant: దేశంలో న్యూ వేరియంట్‌ పంజా.. 459కి చేరిన కేసుల సంఖ్య

దేశంలో న్యూ వేరియంట్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 459కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు.

Omicron variant: దేశంలో న్యూ వేరియంట్‌ పంజా.. 459కి చేరిన కేసుల సంఖ్య
Omicron
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 26, 2021 | 12:28 PM

దేశంలో న్యూ వేరియంట్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 459కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు. ముఖ్యంగా మహారాష్ట్ర ఒమిక్రాన్‌కు సెంటర్‌గా మారింది. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో.. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

దేశంలో ఒమిక్రాన్ విజృంభణతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ పంపిణీకి ఏర్పాట్లుచేస్తోంది. జనవరి 3 నుంచి పిల్లలకు టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందన్నారు.

ఇక 60 ఏళ్ల వయసువారికి జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోస్‌ వేయనున్నారు. ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ప్రికాషన్‌ డోస్‌ వేయనున్నట్టు ప్రకటించారు ప్రధాని. ఇక త్వరలోనే నాజిల్‌, డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని..ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో.. డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు ప్రధాని మోదీ.

మరోవైపు 12 నుంచి 18ఏళ్ల వయసు వారికి భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను ఇచ్చేందుకు DCGI అత్యవసర అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్‌తో పిల్లల్లోనూ అద్భుత ఫలితాలొస్తున్నాయని..కొత్త వేరియంట్‌లపై కూడా..వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది భారత్‌ బయోటెక్‌.

ఇక ఈ ఏడాది జనవరి 16 నుంచి టీకాల పంపిణీ ప్రారంభించామన్నారు ప్రధాని..ఇప్పటివరకు 141కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్‌ అందించామన్నారు. దేశ జనాభాలో 90శాతం మంది ఫస్ట్‌ డోస్‌ కంప్లీట్‌ అయిందని..ఇక 61శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయన్నారు.

Also Read: బెజవాడలో ఇంట్రస్టింగ్ సీన్.. వంశీ, రాధా భేటీ

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.