Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vangaveeti Radha-Vallabhaneni Vamsi: బెజవాడలో ఇంట్రస్టింగ్ సీన్.. వంశీ, రాధా భేటీ

బెజవాడలో ఆదివారం ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. పాత మిత్రులు కలిశారు. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఈ నేతల భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Vangaveeti Radha-Vallabhaneni Vamsi: బెజవాడలో ఇంట్రస్టింగ్ సీన్.. వంశీ, రాధా భేటీ
వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 26, 2021 | 12:32 PM

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఇద్దరూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్. ఇరువురికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. గతంలో వైసీపీలో ఉన్న రాధా ఇప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఇక టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. ప్రజంట్ వైసీపీకి మద్దతుగా వ్యహరిస్తున్నారు. ఆదివారం  వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీటింగ్‌ హాట్‌ టాపిక్‌ అయింది. వంగవీటి రంగా వర్ధంతి సభలో ఈ కలయిక చోటు చేసుకుంది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రంగా విగ్రహానికి ఇద్దరూ కలిసి పూలమాల వేశారు. నివాళి అర్పించారు. అనంతరం.. రాధా కార్యాలయంలో ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. చాలా రోజుల తర్వాత వల్లభవనేని వంశీ వంగవీటిని కలవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ హాట్ చర్చ జరుగుతోంది.

కాగా ఇటీవల గుడివాడ నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తానని.. కొడాలి నానిపై పోటీకి సిద్దమంటూ రాధా సన్నిహితులతో అన్నట్లు వార్తలొచ్చాయి. అనంతరం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తారసపడ్డ మంత్రి కొడాలి నాని, రాధా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వంగవీటి రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

Also Read: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్