Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Timings: శ్రీశైలమహాక్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ వేళల్లో మార్పు.. ఎప్పటి నుంచంటే?

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త తెలిపింది దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

Srisailam Timings: శ్రీశైలమహాక్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ వేళల్లో మార్పు.. ఎప్పటి నుంచంటే?
Srisailam
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 26, 2021 | 1:08 PM

Srisailam Temple Timings: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త తెలిపింది దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. జనవరం 1వ తేదీ నుంచి దర్శన వేళలు మారనున్నాయని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఆదివారం తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలయ సందర్శన వేళలను ప్రభుత్వ సూచనల మేరకు కుదించారు. అయితే, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో జనవరి 1వ తేదీ నుంచి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లు ఈవో వెల్లడించారు. అలాగే, మధ్యాహ్నం 3.30 గంటల నుండి4.30 వరకు ఆలయ శుద్ధి తర్వాత ప్రదోషకాల పూజల సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి అంటుందని తెలిపారు. అయితే, జనవరి ఒకటో తేదీన స్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు తెలిపిన ఈవో.. ఆరోజు మాత్రం భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈవో లవన్న పేర్కొన్నారు. అలాగే జనవరి 1వ తేదీన గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

కర్ఫ్యూ సమయాల్లో మార్పులు చెయడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం క్షేత్రానికి వచ్చే యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అందరూ మాస్కులు ధరించాలని కోరారు. ఇదిలాఉంటే.. స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలతో పాటు సాయంత్రం ప్రదోషకాల నివేదనలు, మహామంగళ హారతులు, అమ్మవారికి ఆస్థానసేవ, లీలా కళ్యాణోత్సవం, ఏకాంత సేవలు యథావిధిగా జరుగుతాయ‌ని ఈవో పేర్కొన్నారు. దైవక్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నెగిటివ్ సర్టిఫికెట్‌తో రావాలని ఆయన సూచించారు.

Read Also…. Omicron Variant: ఇప్పటికీ తేలని ఒమిక్రాన్ పుట్టుక రహస్యం.. ఎలా.. ఎప్పుడు పుట్టిందనే అంచనాల్లో శాస్త్రవేత్తలు