Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ వృత్తిలో ఉన్నా.. ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా..

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 27, 2021 | 6:26 AM

Horoscope Today: వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ వృత్తిలో ఉన్నా.. ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా.. శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 27వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి

ఈ రాశి వారు వారి రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. ప్రేమలో పడే ఈ రాశి వ్యక్తులు తమ ప్రేమ సహచరుడితో తమ మనస్సులోని మాటలను చెప్పుకుంటారు..

వృషభ రాశి

వీరు ముఖ్యమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని వేంకటేశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి. మీ తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి.

మిథున రాశి

ఈ రాశి వారికి ఓ సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.మీ పిల్లలు చిన్నవారైతే, ప్రపంచాన్ని మరచిపోయి ఈరోజు మీరు వారితో సరదాగా గడపాలని కోరుకుంటారు.

కర్కాటక రాశి

సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రోజు మీరు తల్లి వైపు నుండి వ్యక్తులను కలుసుకోవచ్చు. హనుమాన్ చాలీసా చదివితే అనుకున్నది సాధిస్తారు.

సింహ రాశి

ఈ రాశివారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా ఈ రోజు అధిగమించవచ్చు.

కన్య రాశి

మంచి కాలం. మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. పార్టీ కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈరోజు వ్యాపారం చేసే కన్యా రాశి వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

తుల రాశి

ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకులాభిస్తాయి. లక్ష్మీఅష్టకాన్ని చదవాలి. మీ తల్లి ఒక వ్యాపారవేత్త అయితే, ఈ రోజు ఆమెకు మంచి బహుమతి లభిస్తుంది.

వృశ్చికం రాశి

ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధికై వినియోగించండి. బుద్ధిబలంతో కీలక వ్యవహారం నుంచి బయట పడగలుగుతారు. అనేక మూలాల నుండి డబ్బు ప్రయోజనాలు ఆశించబడతాయి. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. ఈ రోజు మీరు సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోండి.

మకర రాశి

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. మీరు బహుళజాతి కంపెనీలో పని చేస్తే, మీరు విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వస్తాయి

కుంభ రాశి

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తోటి వారి సహాయంతో వాటిని అధికమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఈ రోజు సామాజిక స్థాయిలో మీ ప్రతిష్ట పెరుగుతుంది.

మీన రాశి

ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. యితే ఈ రోజు మీరు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం మానుకోవాలి.