Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

తోపుడు బండిపై జామ కాయలు అమ్ముతున్న పై ఫోటోలని వ్యక్తి ఎవరో చిరు వ్యాపారి కాదు.. జామ పండించే రైతు. పేరు పోశం వెంకటరెడ్డి.

Telangana: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్
Guava Farmer
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 24, 2021 | 9:21 PM

తోపుడు బండిపై జామ కాయలు అమ్ముతున్న పై ఫోటోలోని వ్యక్తి ఎవరో చిరు వ్యాపారి కాదు.. జామ పండించే రైతు. పేరు పోశం వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా హాలియా మండలం పెద్దగూడెం గ్రామం ఈయనది. రెండెకరాల భూమిలో జామ పండించి వ్యాపారులకు విక్రయించకుండా నేరుగా తనే అమ్మి రెండింతలు అధిక లాభం పొందుతున్నాడు. హైదరాబాద్ లో పెద్ద సైజు జామ కిలో రూ.90-100 కు దొరుకుతున్నాయి. మీడియం, చిన్న సైజు కాయలు రూ.50-60 కి రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. తోట కాపుకు వచ్చిన తర్వాత అందిరిలాగే తనూ వ్యాపారులకు అమ్మాలనుకున్నాడు. కిలో రూ.15 కు మించి పెట్టేది లేదనడంతో తోపుడు బండిపై పెట్టి హాలియా-పెద్దవూర హైవేపైన పెద్దగూడెం క్రాస్ రోడ్డు వద్ద కిలో రూ.40 కి అమ్ముతున్నాడు. ఎవరైనా పేద వారు వస్తే రూ.5-10 తగ్గించి విక్రయిస్తాడు. రోజుకు 40-50 కిలోలు అమ్ముతాడు. ఆయన ఇద్దరు కుమారులు జామ తోట సస్యరక్షణతో పాటు నాటు కోళ్ల పెంపకం బాధ్యతలు చూస్తారు. నాటు కోడి గుడ్లను కొనుగోలు చేసి ఇన్ క్యుబేటర్లో పొదిగిస్తారు. జామ తోటలో రాలిపోయిన కాయలను తిని కోళ్లు వృద్ధి చెందుతున్నాయి.

కష్టపడి పండించిన జామను వ్యాపారులు కిలో రూ.15 కు అడిగే సరికి, అలా చేస్తే అప్పులు తప్ప తనకు ఆదాయమేమీ ఉండదని గ్రహించి నామోషీ అనుకోకుండా తనే విక్రయించి రెండింతలు ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు. ప్రతి రైతు ఇలాగే తను పండించిన పంటను స్వయంగా అమ్ముకోగలిగితే వ్యవసాయం పండుగ అవుతుంది. నష్టాల ఊసే ఉండదు. వరి రైతు కూడా బియ్యం పట్టించి అమ్మితే కిలో రూ.40 గిట్టుబాటు అవుతుంది. ధాన్యాన్ని కల్లంలో అమ్మిన దానికంటే బియ్యం చేసి విక్రయిస్తే క్వింటాలుకు రూ. 700 అదనంగా సంపాదించగలుగుతారని హాలియాకు చెందిన సేంద్రియ వ్యవసాయ పరిశోధకుడు చింతల ఎర్రాప్రగడారెడ్డి చెప్పారు. ఏ పంట అయినా సరే తనే నేరుగా విక్రయిస్తే నష్టమనేదే ఉండదని ఆయన అంటారు. జామ తోటలో కోళ్లు పెంచడం వల్ల వాటి పెంట ఎరువుగా ఉపయోగపడుతుందని తెలిపారు. Also Read: ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత

కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు