Covid-19 new cases: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రక్కసి.. ఫ్రాన్స్‌లో ఒక్క రోజే లక్ష దాటిన కేసులు..

ఒకవైపు ఒమిక్రాన్‌..మరోవైపు కరోనా.. వరల్డ్‌ వైడ్‌గా న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కల్లోలం సృష్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతూ 2 లక్షలకు చేరువవుతున్నాయి కేసులు. ఇప్పటివరకు..

Covid-19 new cases: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రక్కసి.. ఫ్రాన్స్‌లో ఒక్క రోజే లక్ష దాటిన కేసులు..
France Covid 19 New Cases
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 26, 2021 | 1:27 PM

France Covid-19 New Cases: ఒకవైపు ఒమిక్రాన్‌..మరోవైపు కరోనా.. వరల్డ్‌ వైడ్‌గా న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కల్లోలం సృష్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతూ 2 లక్షలకు చేరువవుతున్నాయి కేసులు. ఇప్పటివరకు లక్షా 83వేలకు పైగా కేసులు నమోదవగా..మరో 31మంది మృతి చెందారు. ఒక్క యూకేలోనే లక్షా 14వేల మందికి పైగా ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. మరో 29 మంది మృతి చెందారు. ఇక డెన్మార్క్‌లో 32వేలు.. కెనడాలో 7,500 ..యూఎస్‌లో 6,331 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. యూకేలో 24గంటల్లోనే లక్షకు పైగా కేసులు వెలుగులోకొస్తుండగా..అటు ఫ్రాన్స్​లో లక్షా 4 వేలకు పైగా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫ్రాన్స్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

ఫ్రాన్స్‌లో మరింత దారుణంగా ఉంది. కేవలం ఒక్క రోజే లక్ష కేసులు నమోదయ్యాయి. నిన్న అంటే శనివారం రోజు 104,611 కొత్త కోవిడ్ -19 కేసులు రికార్డ్ అయ్యాయి. గత కొద్ది రోజుల్లో ఇదే అతి పెద్ద రికార్డ్. మొత్తం 16,162 కోవిడ్ -19 బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 3,282 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. ఫ్రెంచ్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీని వెల్లడించిన వివరాల ప్రకారం.. అదనంగా 84 కోవిడ్-19 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 122,546కి చేరింది.

ఇటలీలోనూ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 54వేలకు పైగా కేసులు వెలుగులోకొచ్చాయి. రష్యాలో 24గంటల్లో 25వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ కొవిడ్‌ పంజా విసిరింది. 40వేల మందికి పైగా కరోనా సోకింది.

ఇక భారత్‌లోనూ న్యూ వేరియంట్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 459కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు. ముఖ్యంగా మహారాష్ట్ర ఒమిక్రాన్‌కు సెంటర్‌గా మారింది. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..

Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!