Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రోజుల్లో కుక్క పిల్లల వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన యూజర్లు తెగ భావోద్వేగానికి గురవుతున్నారు.
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రోజుల్లో కుక్క పిల్లల వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన యూజర్లు తెగ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియోలో రోట్‌వీలర్ జాతికి చెందిన మూడు కుక్కపిల్లలు బోనులో ఉన్నాయి. ఈ సమయంలో ఓ బుజ్జి కుక్క మెడ బోన్ గ్రిల్‌లో చిక్కుంది. అయితే ఇది గమనించిన మిగిలన కుక్కపిల్లలు ఆందోళనకు గురయ్యాయి. దానిని రక్షించేందుకు తెగ ప్రయత్నించాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ బుజ్జి కుక్కను మరో చిన్న కుక్క పిల్ల కాపాడింది. ఈ వీడియోను చూసిన జనం తెగ ముచ్చటపడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో కుక్కకు చెందిన ముగ్గురు పిల్లలను బోనులో బంధించడాన్ని మీరు చూడవచ్చు. వీరిలో ఒకరి మెడ బోనులో ఇరుక్కుపోయింది. నొప్పితో పెద్దగా అరిచింది. ఇది చూసిన జంతు ప్రేమికులు ఉద్వేగానికి లోనవుతారు. కుక్క పిల్ల పరిస్థితి చూస్తే ఎంత బాధగా ఉంటుందో అంచనా వేయొచ్చు. అయితే ఆ తర్వాత షాకింగ్ సంఘటన జరిగింది. బోనులో ఉన్న మరో కుక్కపిల్ల దానిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. అది సహాయం చేయడం.. ఆ పప్పి బయట పడటం అద్భుతంగా ఉంటుంది. ఈ సీన్ చూస్తేనే తెలుస్తుంది అందులోని ప్రేమ.. తోపిటివారికి సహాయం చేయడంలో ఉండే మజా.. ఈ వీడియో చూద్దాం.
View this post on Instagram
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రోటీమీడియా అనే ఖాతాతో షేర్ చేశారు. వినియోగదారు క్యాప్షన్‌లో, ‘ఓహ్.. ఎంత విచారకరం.’ నవంబర్ 25న షేర్ చేసిన ఈ వీడియోని ఎంత మంది లైక్ చేస్తున్నారో.. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా లైక్ చేశారనే వాస్తవాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో దీనిపై చాలా మంది తమదైన రీతిలో స్పందించారు. ఈ వీడియో చూసిన తర్వాత, యూజర్లు చాలా కోపంగా ఉన్నారు. వీడియో తీసే బదులు కుక్కను కాపాడి ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఒక నెటజన్ ఇలా కామెంట్ చేశాడు. ‘కుక్కపిల్ల తన సోదరుడి ప్రాణాలను రక్షించడంలో బిజీగా ఉంది. వీడియో చేసిన వ్యక్తి పట్ల నేను చింతిస్తున్నాను’ అని రాశారు. ఇది కాకుండా కామెంట్ సెక్షన్‌లోని చాలా మంది వినియోగదారులు వీడియో మేకర్‌కు తీవ్రంగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: PM Modi: అటల్‌జీ జయంతి రోజున బీజేపీ నిధుల ప్రచారం.. తొలి విరాళం ప్రకటించిన ప్రధాని మోడీ