AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై అవినీతి ఆరోపణలు……విచారణ జరపనున్న మయన్మార్ ప్రభుత్వం

మయన్మార్ లో సైనిక ప్రభుత్వం నిర్బంధంలో ఉన్న మాజీ నేత ఆంగ్ సాన్ సూకీపై అవినీతి ఆరోపణలు మోపింది. ఆమె అక్రమంగా లక్షల డాలర్లు, బంగారం తీసుకున్నారని, తన చారిటబుల్ ట్రస్ట్ కోసం చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంది.

నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్  సాన్ సూకీపై అవినీతి ఆరోపణలు......విచారణ  జరపనున్న మయన్మార్ ప్రభుత్వం
Myanmar Junta Hits Aung Saan Duu Kyi Corruption Charges
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 10, 2021 | 2:54 PM

Share

మయన్మార్ లో సైనిక ప్రభుత్వం నిర్బంధంలో ఉన్న మాజీ నేత ఆంగ్ సాన్ సూకీపై అవినీతి ఆరోపణలు మోపింది. ఆమె అక్రమంగా లక్షల డాలర్లు, బంగారం తీసుకున్నారని, తన చారిటబుల్ ట్రస్ట్ కోసం చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఆమె.. గత ఫిబ్రవరి 1 నుంచి సైనిక ప్రభుత్వ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే..ఆమెపై రాజద్రోహం కేసును కూడా మోపారు. తన నుంచి ఆమె అక్రమంగా 6 లక్షల డాలర్ల నగదును, 11 కిలోల బంగారాన్ని తీసుకున్నారని యాంగూన్ మాజీ సీఎం ఒకరు ఆరోపించారు. అయితే ఆమె ఎందుకీ సొమ్మును, గోల్డ్ ను తీసుకున్నారో ఆయన వెల్లడించలేదు. ఆంగ్ సాన్ తన పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అవినీతి నిరోధక కమిషన్ కనుగొన్నదని గ్లోబల్ న్యూలైట్ మయన్మార్ డైలీ తెలిపింది. తన చారిటబుల్ ట్రస్ట్ కోసం ఆమె రెండు ఖరీదైన భవనాలను అద్దెకు ఇచ్చారని కూడా ఈ కమిషన్ కనుగొన్నట్టు ఈ పత్రిక పేర్కొంది. తాజాగా ఇన్నాళ్లూ సాదాసీదా ఆరోపణలపై ఆమెపై కోర్టులో విచారణ జరిగేలా చూసేందుకు యత్నించిన సైనిక ప్రభుత్వం ఇప్పుడు దారుణమైన ఆరోపణలు మోపిందని ఆమె తరఫు లాయర్ మండిపడ్డారు.

ఈ ఆరోపణలు నిరాధారాలని, తన క్లయింటును దేశం నుంచి విడిచి వెళ్లేలా చూడడానికే ఈ ప్రభుత్వం ఈ అభియోగాలు మోపిందని ఆయన అంటున్నారు. కాగా వచ్చే వారం ఆంగ్ సాన్ సూకీని కోర్టు మళ్ళీ మూడో సారి విచారించనుంది. నిర్బంధంలో ఉన్న ఆమెను విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా వేలమంది నిరసన ప్రదర్శనలు చేశారు. ఇప్పటివరకు జరిగిన హింసలో 800 మందికి పైగా మరణించగా వెయ్యిమందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Actor Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు.

Covid-19 vaccination : టీకా పంపిణీపై సెంట్రల్ స్పెషల్ ఫోకస్ తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.

ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది..అన్నం తినలేదు కొట్టాను అంటూ తల్లి కేర్ లెస్ ఆన్సర్ :Viral video.

Pfizer expands vaccine :12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఫైజర్ వాక్సిన్..చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ పార్రంభం..?(వీడియో)