Viral News: చైనా ఫుడ్.. అక్కడి ప్రజలు బొద్దింకల సూప్‌ను తెగ తింటారట.? రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఔట్.!
చైనీయుల కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న కీటకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువులను సైతం కోసుకుని తినేస్తుంటారు.
చైనీయుల కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషిని తప్ప కీటకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువులను సైతం కోసుకుని తినేస్తుంటారు. ఇదిలా ఉంటే చైనీయులు ఎంతో ఇష్టంగా బొద్దింకల జ్యూస్, సిరప్ తాగుతుంటారట. ఆ దేశంలో ఒక నగరం ప్రత్యేకంగా బొద్దింకలను పెంచుతోందని తెలుస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని జిచాంగ్ నగరంలో ఓ ఔషధ సంస్థ ప్రతీ సంవత్సరం సుమారు 600 మిలియన్ల బొద్దింకలను పెంచుతోంది. బొద్దింకలను పెంచేలా ఆ భవనంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
బొద్దింకల సిరప్ తాగేది అందుకే…
అక్కడి వారు బొద్దింకల పెంపకాన్ని పర్యవేక్షించడానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను ఉపయోగిస్తారు. దీని ద్వారా, భవనం లోపల ఉష్ణోగ్రత, ఆహారం లభ్యత, తేమపై నియంత్రణ ఉంటుంది. తక్కువ వ్యవధిలో వీలైనన్ని బొద్దింకలను ఉత్పత్తి చేయడమే వారి లక్ష్యం. ఇక ఆ బొద్దింకలు పెద్దవైనప్పుడు.. వాటిని చూర్ణం చేసి సాంప్రదాయ చైనీస్ ఔషధంలో సిరప్‌గా వాడతారు. అతిసారం, వాంతులు, కడుపు పూత, శ్వాస ఆడకపోవడం వంటి రోగాలకు చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
చైనాలోని షాన్డాంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లియు యుషెంగ్ మీడియాతో మాట్లాడుతూ బొద్దింక దానంతట అదే ఒక ఔషధం అని వివరించారు. దాని ద్వారా అనేక వ్యాధులను నయం చేయవచ్చు. చైనాలో వృద్ధుల జనాభా పెద్ద సమస్య కావడంతో.. వారి వ్యాధుల చికిత్స కోసం, చౌకగా, సులభంగా లభించే కొత్త ఔషధాల కోసం తరచూ శోధిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!
మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!