AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Risks Of Mobile Phones: మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!

స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మన జీవన శైలిలో అతిముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్స్‏కు..

Health Risks Of Mobile Phones: మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!
Mobile
Ravi Kiran
|

Updated on: Jun 10, 2021 | 12:54 PM

Share

స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మన జీవన శైలిలో అతిముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. లాక్ డౌన్ ప్రభావంతో వీటి వాడకం మరింత ఎక్కువైంది. అసలే కరోనా కాలం కావడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ నుంచి ఆన్‌లైన్ క్లాసులు వరకు అన్నీ మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. అయితే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల కళ్లు, మెడకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్, టీవీ లేదా కంప్యూటర్‏లో మనం ఎక్కువ సేపు ఏవైనా వీడియోస్ చూడడం వలన కళ్లపై స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుందట . అలాగే ఫోన్‏లో గంటలు గంటలు మాట్లాడం వలన అనేక రకాల మెడ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటంటే..

మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటం వల్ల..

  • మెడనొప్పి వస్తుంది.
  • యాక్టివ్‌గా ఉండలేరు
  • ఆలోచనా శక్తి తగ్గుతుంది
  • ముఖంపై ముడతలు వస్తాయి
  • ఫోన్ మీద ఉన్న వైరస్, బ్యాక్టీరియాలు ముఖం మీదకు చేరతాయి
  • ఫోన్ నుంచి వచ్చే బ్లూలైట్ రేస్ వల్ల చర్మం దెబ్బతింటుంది
  • కళ్లు దెబ్బతింటాయి
  • తలనొప్పి, నిద్రపట్టకపోవడం, అలసట వస్తాయి

Also Read: 

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!

మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా.? అయినా లోన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి.!