Crime News: పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!

ఎన్‌ఆర్‌ఐ సంబంధం వచ్చిందని ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడ్డారు. తమ కూతురుకు రూ. 20 లక్షలు ఖర్చుపెట్టి మరీ ఘనంగా వివాహం చేశారు...

Crime News: పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 10, 2021 | 12:41 PM

ఎన్‌ఆర్‌ఐ సంబంధం వచ్చిందని ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడ్డారు. తమ కూతురుకు రూ. 20 లక్షలు ఖర్చుపెట్టి మరీ ఘనంగా వివాహం చేశారు. అంతా బాగానే ఉందని అనుకునేలోపే ఆ నవ వధువుకు పెళ్లైన తొలి రాత్రే భర్త దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చాడు. ఇంకేముంది ఆమె భోరున విలపిస్తూ తన కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పుకుంది. కథ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి విజయవాడకు చెందిన ఓ యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన తెనాలిలో వివాహం జరిగింది. తమ కొడుకు త్వరలోనే చదువుల కోసం కెనడా వెళుతున్నాడని.. అక్కడే పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటాడని, పెళ్లి చేసుకుని భార్యను కూడా తీసుకెళ్తాడని.. వరుడు తల్లిదండ్రులు చెప్పడంతో పాటు వీసా, ఇతర డాక్యుమెంట్స్ చూపించడంతో వధువు తరపు కుటుంబసభ్యులు మంచి సంబంధం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసి సుమారు రూ. 20 లక్షలు ఖర్చుపెట్టి మరీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లైన తొలిరాత్రే తాను నపుంసకుడిని అని ఆ యువకుడు తన భార్యకు చెప్పడంతో ఆమె కంగుతుంది.

ఈ విషయాన్ని ఆ మర్నాడు జరిగిన రిసెప్షన్‌లో తన తల్లిదండ్రులకు చెప్పుకుని వధువు భోరున విలపించింది. దీనితో వారు ఆమెను తెనాలిలోని పుట్టింటికి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత పలుమార్లు ఇరు కుటుంబాల పెద్దలు చర్చలు జరిపారు. ఇక ఇటీవల విజయవాడలో ఇరుపక్షాల మధ్య పంచాయితీ జరగ్గా.. తమకు రిసెప్షన్‌ నిమిత్తం రూ. 8 లక్షలు ఖర్చయిందని.. ఆ మొత్తం ఇవ్వాలని పెళ్లి కొడుకు తరపువారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా యువతి, ఆమె కుటుంబ సభ్యులపై దాడి కూడా చేశారు. దీనితో బాధిత యువతి తెనాలి త్రీ టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..