ములక్కాడ ఆకుల రసం వారానికి ఒక్కసారి తాగితే రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. డయాబెటిస్ రోగులకు షుగర్ లెవల్స్ కంట్రోల్..

Drumstick Leaves Soup: ప్రస్తుతం కరోనా నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది రోగ నిరోధక శక్తి. ఇందుకోసం సహజ వనరులతో

ములక్కాడ ఆకుల రసం వారానికి ఒక్కసారి తాగితే రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. డయాబెటిస్ రోగులకు షుగర్ లెవల్స్ కంట్రోల్..
Drumstick Leves

Drumstick Leaves Soup: ప్రస్తుతం కరోనా నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది రోగ నిరోధక శక్తి. ఇందుకోసం సహజ వనరులతో చేసిన కషాయాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే మాములు ప్రజలు అనేక రకాల పండ్లు, కూరగాయలను తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుండగా.. డయాబెటీస్, రక్తపోటు ఉన్నవారికి మాత్రం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కొంత కష్టంగా మారింది. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‏లో ఉంచుతూ.. ఆరోగ్యకరమైన రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ములక్కాడ ఆకుల రసం… రక్తపోటు.. డయాబెటీస్ ఇతర వ్యాధులు ఉన్నవారికి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహయపడుతుందని తాజా అధ్యాయనంలో తేలీంది.

ములక్కాడ ఆకుల రసం వారానికి ఒక్కసారి తాగితే.. రక్తపోటును తగ్గించడమే కాకుండా.. డయబెటీస్ రోగులలోని రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది. అలాగే నిద్రలేమి, గొంతు నొప్పి, జలుబు, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ములక్కాడ ఆకుల రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా.

కావల్సినవి…
ములక్కాడ ఆకులు.. 1 1/2 ఆకులు..
బియ్యం నీరు.. 2 కప్పులు
సాంబార్ ఉల్లిపాయ..5
టమోటాలు..1
పచ్చిమిర్చి..1
కొబ్బరి పాటు.. 1 కప్పు
జీలకర్ర.. 1 స్పూన్
మిరియాలు.. 1/2 స్పూన్
ఉప్పు… తగినంత

తయారీ విధానం..
ముందుగా బియ్యం నానబెట్టిన నీటిని ఒక పాత్రలో వేసి మరిగించాలి. ఆ తర్వాత అందులో ములక్కాడ ఆకులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులోనే టామోటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఈ పదార్థాలన్ని ఉడికిన తర్వాత అందులోనే కొబ్బరి పాలు, మిరియాల పొడి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడకబెట్టాలి. పక్కనే మరో బాణలిలో నూనె వేడి చేసి.. జీలకర్ర, కరివేపాకు వేసి ములక్కాడ నీటిలో కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన గొంతు నొప్పి, జలుబు సమస్యలు, దగ్గు తగ్గుతుంది.

Also Read: Vishal: డాక్యుమెంట్స్ వివాదం.. ఆ బడా ప్రొడ్యూసర్ పై హీరో విశాల్ ఫిర్యాదు.. ట్వీట్ వైరల్..

తమిళ స్టార్ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ఆ డైరెక్టర్‏కు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాణ సంస్థ ?