తమిళ స్టార్ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ఆ డైరెక్టర్‏కు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాణ సంస్థ ?

Ram Charan: రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న చెర్రీ..

తమిళ స్టార్ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ఆ డైరెక్టర్‏కు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాణ సంస్థ ?
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 10, 2021 | 8:19 AM

Ram Charan: రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న చెర్రీ.. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్… కాంబోలో వచ్చే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చరణ్ తో సినిమా చేసేందుకు మిగతా డైరెక్టర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్..శంకర్ మూవీ తర్వాత మరో తమిళ డైరెక్టర్ ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల కార్తీ నటించిన ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక ప్రస్తుతం ఈ డైరెక్టర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు లోకేష్.. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేయాలని తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అటు రామ్ చరణ్ కూడా ఈ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమచారం. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాను తెలుగు, తమిళ ద్విభాష చిత్రంగా తెరకెక్కించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరి కలయిక వచ్చే సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లుగా సమాచారం. ఇందుకోసం ఇప్పటికే లోకష్ కనగరాజ్ కు రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లుగా తెలుస్తోంది. Lokesh Kanagaraj

Also Read: Kajal Aggarwal: మరోసారి ఆ స్టార్ హీరో సరసన కాజల్.. ‘ఖైదీ’ భార్యగా నటించనున్న అందాల చందమామ..

Surya: హీరో సూర్య గొప్ప మనసు.. అభిమానులకు అండగా సూర్య.. 250 మందికి రూ.12.5 లక్షల విరాళం…

Balakrishna : ప్రజలంతా సంబరాలు జరుపుకుంటుండగా దర్జాగా నడిచొస్తున్న నటసింహం.. బాలయ్య బర్త్ డే స్పెషల్ పోస్టర్..