Kajal Aggarwal: మరోసారి ఆ స్టార్ హీరో సరసన కాజల్.. ‘ఖైదీ’ భార్యగా నటించనున్న అందాల చందమామ..

కాజల్ అగర్వాల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చందమామ సినిమాతో హిట్ కొట్టింది.

Kajal Aggarwal: మరోసారి ఆ స్టార్ హీరో సరసన కాజల్.. 'ఖైదీ' భార్యగా నటించనున్న అందాల చందమామ..
Kajal
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 10, 2021 | 6:52 AM

కాజల్ అగర్వాల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చందమామ సినిమాతో హిట్ కొట్టింది. ఈ మూవీ తర్వాత కాజల్‏కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే ఈ ముద్దు గుమ్మ టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. ఇటు టాలీవుడ్‏లోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్‏లోని బడా హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. అయితే ఇటీవల గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడు ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కలయికలో వస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‏గా నటిస్తుంది. శరవేగంగా జరుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా వైరస్ కారణాంగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. కాజల్‏కు మరో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

కాజల్ అగర్వాల్.. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‏కు జోడీగా సింగం సినిమాలో నటించింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్‌–కాజల్‌ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తమిళంలో కార్తీ ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ఖైదీ. ఈ సినిమాను హిందీలో రిమేక్ చేయబోతున్నారట. ఈ మూవీ రీమేక్ హక్కులు దక్కించుకున్న అజయ్ దేవగణ్ త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజయ్ కు జోడీగా కాజల్ నటించబోతున్నట్లుగా టాక్. అయితే ఒరిజినల్ ఖైదీలో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు.కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కాజల్ క్యారెక్టర్ పై అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Surya: హీరో సూర్య గొప్ప మనసు.. అభిమానులకు అండగా సూర్య.. 250 మందికి రూ.12.5 లక్షల విరాళం…

Balakrishna : ప్రజలంతా సంబరాలు జరుపుకుంటుండగా దర్జాగా నడిచొస్తున్న నటసింహం.. బాలయ్య బర్త్ డే స్పెషల్ పోస్టర్..