AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya: హీరో సూర్య గొప్ప మనసు.. అభిమానులకు అండగా సూర్య.. 250 మందికి రూ.12.5 లక్షల విరాళం…

దేశంలో కరోనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చింది. ఉద్యోగాలు.. పనులు లేక ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు.

Surya: హీరో సూర్య గొప్ప మనసు.. అభిమానులకు అండగా సూర్య.. 250 మందికి రూ.12.5 లక్షల విరాళం...
Surya
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2021 | 6:31 AM

Share

దేశంలో కరోనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చింది. ఉద్యోగాలు.. పనులు లేక ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఇక ఈ కోవిడ్ మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఎక్కువగానే దెబ్బకొట్టింది. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ నిలిచిపోగా.. థియేటర్లు సైతం మూతపడ్డాయి. దీంతో సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. ఇక కరోనా కట్టిడికి రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు తమ అభిమానులకు సహాయం అందించేందుకు ముందుగు వస్తున్నారు. ఇప్పటికే కేజీఎప్ హీరో యష్ సినీ కార్మికుల కోసం భారీగా విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరో సూర్య కూడా ఒకడుగు ముందుకేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు అండగా నిలిచారు.

తన అభిమాన సంఘంలో ఉన్న 250 మంది అభిమానులకు సూర్య ఆర్థిక సహాయం చేశారు. 250 అభిమానులకు ఒక్కోక్కరికి రూ. 5000 చోప్పున మొత్తం రూ.12.5 లక్షలను ఆర్థిక సాయంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమచేశారు. సూర్య చేసిన ఈ సహాయానికి ఫ్యాన్స్ అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్నిరోజుల క్రితం కూడ సూర్య కరోనా మీద పోరాటానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. అలాగే వీటి తర్వాత వెట్రిమారాన్ దర్శకత్వంలో వాడి వాసల్ సినిమా చేయనున్నాడు సూర్య.

Also Read: Balakrishna : ప్రజలంతా సంబరాలు జరుపుకుంటుండగా దర్జాగా నడిచొస్తున్న నటసింహం.. బాలయ్య బర్త్ డే స్పెషల్ పోస్టర్..

Director Prashanth Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్..! KGF 2 సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Movie Sequels: సీక్వెల్స్ తో సిద్దమవుతున్న స్టార్ హీరోలు.. టాలీవుడ్ -బాలీవుడ్ లో వరుస సీక్వెల్స్..

Nandamuri Balakrishna: సోలోగా వస్తానంటున్న బాలయ్య.. అఖండ రిలీజ్ పై అభిమానుల్లో ఆసక్తి..