Nandamuri Balakrishna: సోలోగా వస్తానంటున్న బాలయ్య.. అఖండ రిలీజ్ పై అభిమానుల్లో ఆసక్తి..
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అఖండ. సింహా, లెజెండ్ లాంటి బిగ్ హిట్స్ తరువాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Akhanda : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అఖండ. సింహా, లెజెండ్ లాంటి బిగ్ హిట్స్ తరువాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు బోయపాటి. ఫస్ట్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే అఖండ ఈ పాటికే ఆడియన్స్ ముందుకు వచ్చుండేది. మే 28న సినిమా రిలీజ్ అంటూ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు ఆ ప్లానింగ్ డిస్ట్రబ్ అయ్యింది. షూటింగ్ పూర్తి కాకపోవటంతో.. రిలీజ్ వాయిదా పడింది. దీంతో నెక్ట్స్ రిలీజ్ డేట్ ఎప్పుడన్న డిస్కషన్ మొదలైంది.
అయితే సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు పోస్ట్‌పోన్ కావటంతో అంతా దసరా వైపే చూస్తున్నారు. ఆల్రెడీ దసరా సీజన్‌కు రిలీజ్ అంటూ ట్రిపులార్ టీమ్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు కూడా అదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఇంత బిజీ సీజన్‌లో అఖండ రిలీజ్ చేయటం కరెక్ట్ కాదనుకుంటున్నారట బాలయ్య. అందుకే కాస్త ఆలస్యంగా సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. భారీ సినిమాలతో పోటి పడి కలెక్షన్లు లాస్ అయ్యే కన్నా సోలోగా వచ్చి సత్తాచాటాలన్నది బాలయ్య, బోయపాటి ప్లాన్.. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :