Vishal: డాక్యుమెంట్స్ వివాదం.. ఆ బడా ప్రొడ్యూసర్ పై హీరో విశాల్ ఫిర్యాదు.. ట్వీట్ వైరల్..

Vishal: తమిళ స్టార్ హీరో విశాల్‏కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో విశాల్ సినిమాలు చాలానే తెలుగులో సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

Vishal: డాక్యుమెంట్స్ వివాదం.. ఆ బడా ప్రొడ్యూసర్ పై హీరో విశాల్ ఫిర్యాదు.. ట్వీట్ వైరల్..
Vishal
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 10, 2021 | 9:09 AM

Vishal: తమిళ స్టార్ హీరో విశాల్‏కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో విశాల్ సినిమాలు చాలానే తెలుగులో సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సౌత్ హీరో మరో వివాదంలో వార్తల్లో నిలిచాడు. ఓ ప్రముఖ నిర్మాత పై పోలీస్ కేసు నమోదు చేసినట్లుగా విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. 2018లో విశాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇరుంబు తురై (అభిమన్యుడు) మూవీకి సంబంధించిన ఆర్థిక విషయంలో వీరిద్ధరి మధ్య వివాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అదే వివాదంపై ఇప్పడు పోలీస్ కేసు వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇరుంబు తురై సినిమా కోసం విశాల్.. నిర్మాత ఆర్బీ చౌదరీ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడట. అయితే ఆ సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ నిర్మాతకు ఇచ్చిచాడ విశాల్. అప్పు మొత్తం తిరిగి చెల్లించిన తర్వాత డాక్యుమెంట్స్ అడుగగా.. నిర్మాత మాట మార్చేసాడని విశాల్ ఆరోపించాడు.

ఈ మేరకు విశాల్ ఆ నిర్మాతపై కేసు నమోదు చేసినట్లుగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. “మిస్టర్ ఆర్బిచౌదరి గారు.. ఇరుంబుతిరై సినిమాకోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించి కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు సినిమాకు ముందు రాసుకున్న చెక్ లీవ్స్ – బాండ్స్ – ప్రామిసరీ నోట్స్ తిరిగి ఇవ్వకపోవడం తాను అంగీకరించట్లేదని.. అలాగే ఇప్పుడు డాకుమెంట్స్ అడిగితే ఎక్కడ పెట్టానో కనిపించడం లేదని సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడని… అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్వీట్ లో తెలిపాడు. పత్రాలను తిరిగి ఇవ్వాలని నాలుగు నెలలకు పైగా అడుగుతున్నా ఇవ్వలేదని విశాల్ చెప్పుకొచ్చాడు.

ట్వీట్..

Also Read: తమిళ స్టార్ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ఆ డైరెక్టర్‏కు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాణ సంస్థ ?

Surya: హీరో సూర్య గొప్ప మనసు.. అభిమానులకు అండగా సూర్య.. 250 మందికి రూ.12.5 లక్షల విరాళం…