AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score Check: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా.? అయినా లోన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి.!

క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్.. మీరు ఏదైనా లోన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇవి ముఖ్యపాత్రను పోషిస్తాయి. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే..

Credit Score Check: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా.? అయినా లోన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి.!
Credit Score
Ravi Kiran
|

Updated on: Jun 10, 2021 | 12:48 PM

Share

క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్.. మీరు ఏదైనా లోన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇవి ముఖ్యపాత్రను పోషిస్తాయి. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే.. రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రూల్స్ కూడా తేలికగా ఉంటాయి. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. అయితే మీరు ఇంతకు ముందు లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకోకపోతే.. మీ క్రెడిట్ స్కోరు జీరో ఉండొచ్చు.

వినియోగదారుడికి రుణాలు ఇచ్చేముందు బ్యాంకులు నిర్ణీత సమయంలో అతడు తిరిగి చెల్లిస్తాడా.? లేదా.? అనే విషయాలను పరిశీలిస్తాయి. అందుకే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఈ సమస్యను క్రెడిట్ స్కోర్‌ల ద్వారా పరిష్కరిస్తాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు. క్రెడిట్ స్కోరు 750 కన్నా ఎక్కువ ఉన్న కస్టమర్‌కు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు సౌకర్యంగా ఉంటాయని చెబుతున్నారు.

క్రెడిట్ స్కోర్ లేని వ్యక్తి ఏదైనా లోన్ తీసుకోగలడా..?

అయితే క్రెడిట్ స్కోర్ లేని వ్యక్తి ఏదైనా లోన్ తీసుకోగలడా.? ట్యాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జైన్ ప్రకారం, బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు క్రెడిట్ స్కోరు‌ను ఒక ప్రామాణికంగా తీసుకుంటాయి తప్పితే.. దాన్ని క్రయటీరియాగా చూడవని స్పష్టం చేశాడు. కాబట్టి మీకు క్రెడిట్ స్కోర్ ఏమి లేకపోయినా.. కూడా మీరు హోం లోన్ పొందవచ్చు. దానికోసం మరిన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా రుణదాత మీ సామర్థ్యం, సమయానికి EMIలను చెల్లించే విషయాల్లో సంతృప్తి చెందుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీ విద్యార్హత, ఉద్యోగ ప్రొఫైల్ ముఖ్యమైన ప్రమాణాలుగా ఉంటాయని ట్యాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జైన్ అన్నాడు. ఉదాహరణకు మీరు డాక్టర్ లేదా సీఏ అయితే, ఇది మీ రెగ్యులర్ ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. అదే విధంగా, ఎవరైనా ప్రభుత్వ స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉంటే – ఐఏఎస్ లేదా ఐపీఎస్ వంటివి, అలాంటివారికి క్రెడిట్ స్కోర్ లేకపోయినా.. గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉన్నత విద్యార్హత లేకపోయినా గృహ రుణం పొందవచ్చు…

మీకు ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉన్నత విద్యార్హత లేకపోయినా మీరు గృహ రుణం పొందవచ్చు. ఇటువంటి సందర్భాల్లో, బ్యాంకులు మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి గత కొన్నేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను అడగవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్(SIP) వంటి పెట్టుబడులకు రెగ్యులర్ డెబిట్స్ ఉంటే, మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.

కరెంట్ బిల్స్, మొబైల్ బిల్స్ వంటివి మీరు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారా అని అర్థం చేసుకోవడానికి బ్యాంకులు మీ బ్యాంకింగ్ లావాదేవీలను కూడా వివరంగా పరిశీలించవచ్చు. మీరు అద్దె ఇంటిలో నివాసం ఉంటుంటే.. వారు మీ అద్దె చెల్లింపులను కూడా చూడవచ్చు. మీ ఖర్చులు, పొదుపు అలవాట్లను మీ బ్యాంక్ స్టేట్మెంట్ల నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇవి మీరు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించగలరా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. అంతేకాకుండా మిమ్మల్ని మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తి నుంచి హామీ పొందమని అడగవచ్చు. సాధారణ క్రెడిట్ స్కోర్ రిపోర్టులు లేనప్పుడు రుణదాతలు పరిశీలించే కొన్ని ఐచ్ఛిక ప్యారామీటర్స్ ఇవి. అయితే, ఈ ప్రమాణాలను అన్ని బ్యాంకులకు ఒకేలా ఉండకపోవచ్చు. ప్రతీ బ్యాంక్ లోన్స్ మంజూరు చేసేటప్పుడు అంతర్గతంగా కొన్ని రూల్స్‌ను పాటిస్తూ ఉంటాయి.

Also Read: 

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!