PM Awas Yojana: గుడ్‏న్యూస్ చెప్పిన కేంద్రం.. 3.61 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండిలా..

PM Awas Yojana: సొంతంగా ఇళ్లు నిర్మించుకోవాలని కళలు కనేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (pmayu)

PM Awas Yojana: గుడ్‏న్యూస్ చెప్పిన కేంద్రం.. 3.61 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండిలా..
Pm Awas Yojana

PM Awas Yojana: సొంతంగా ఇళ్లు నిర్మించుకోవాలని కళలు కనేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (pmayu) పథకం కింద 3.61 లక్షల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కేంద్ర కేటాయింపులు, పర్వవేక్షణ కమిటీ 54వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గోన్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం వచ్చిన 708 ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందరికీ హౌసింగ్ అనే ఉద్దేశ్యంతో 2022 నాటికి దేశంలో అర్హత కలిగిన లబ్ధిదారులకు పక్కా ఇళ్లను అందించే లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాముఖ్యత ఇస్తుందని.. మంత్రిత్వ శాఖ పేర్కోంది. ‘పిఎంఎవై-యు’ (పిఎం ఆవాస్ యోజన) కింద నిర్ణీత వ్యవధిలో దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లుగా గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పీఎం ఆవాస్ యోజన కింద ఇప్పటికే ఇప్పటివరకు ఆమోదించబడిన ఇళ్ల సంఖ్య 112.4 ఇళ్లను మంజూరు చేసామని.. అందులో ఇప్పటివరకు 82.5 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని.. . అలాగే 48.31 లక్షల ఇళ్ళు లబ్ధిదారులకు కేటాయించమని తెలిపింది. ఇందుకోసం మొత్తం పెట్టుబడి రూ .7.35 లక్షల కోట్లుగా నిర్ణయించగా, అందులో రూ .1.81 లక్షల కోట్లు కేంద్ర సహాయంగా వచ్చాయి. ఈ మొత్తంలో రూ .96,067 కోట్లు కూడా విడుదల చేసినట్లుగా తెలిపారు.

గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ‘పీఎంఎవై-యు అవార్డ్స్ 2021- 100 డేస్ ఛాలెంజ్’ ను కూడా ప్రారంభించారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు), పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్‌బిలు), లబ్ధిదారులు చేసిన అద్భుతమైన సహకారం, పనితీరును గుర్తించడానికి అవార్డులు ఇవ్వబడతాయి.

ఈ సమావేశంలో దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ “అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి అనుమతి కోసం డిమాండ్ లేవనెత్తుతోంది. మా ప్రధాన దృష్టి నిర్ణీత సమయానికి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడటం మరియు వినియోగించని నిధుల వినియోగం. ”

హౌసింగ్ స్కీమ్ లో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..
పీఎం ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేయాలనుకున్న… అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా డిపార్ట్‏మెంటల్ అధికారులను సంప్రదించాలి. అంతేకాకుండా.. పీఎం ఆవాస్ యోజన్ అధికారికి వెబ్ సైట్ (https://pmaymis.gov.in/) కు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ అసెస్ మెంట్ స్టేటస్ (https://pmaymis.gov.in/track_application_status.aspx) పై క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్టర్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్ ద్వారా కూడా మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు నింపిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాగానే మీ పూర్తి వివరాలు కనిపిస్తాయి.

Also Read: Allu Arha: చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్న బన్నీ డాటర్.. అల్లు అర్హ క్యూట్ వీడియో వైరల్..

HBD Balakrishna: ఇట్స్ అఫీషియల్.. బాలయ్యను సెట్స్‏లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నానంటున్న డైరెక్టర్.. టీజర్ అదుర్స్..